Rohit Sharma: ఐపీఎల్ 2024 ట్రేడ్ విండో క్లోజ్.. ముంబైకే ఆడనున్న రోహిత్ శర్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma will play for Mumbai Indians in IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం సమయంలో ముంబై ఇండియన్స్ ప్రాంచైజీలో మార్పులు జరిగిన విషయం తెలిసిందే. ముంబైకి ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించింది. దాంతో రోహిత్ వేరే జట్టుకు వెళ్లిపోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు హిట్‌మ్యాన్‌ను ట్రేడింగ్ చేసేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి కూడా చూపాయి. అయితే రోహిత్‌ను వదులుకోవడానికి ముంబై ఫ్రాంచైజీ ఇష్టపడలేదు.
తాజాగా ఐపీఎల్ 2024 ట్రేడ్ విండో క్లోజ్ అయ్యింది. గత డిసెంబర్‌లో జరిగిన మినీ వేలం తర్వాత ఓపెన్ అయిన ట్రేడ్ విండో.. ఐపీఎల్ షెడ్యూల్ రావడంతో క్లోజ్ అయింది. దీంతో 17వ సీజన్‌లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరఫునే బరిలోకి దిగనున్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ తొలిసారి ఆడనున్నాడు. ఇక వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ప్రాంచైజీ రోహిత్‌ను వదిలేస్తుందని తెలుస్తోంది. ఐపీఎల్ 2025 వేలంలోకి హిట్‌మ్యాన్ రావడం దాదాపు ఖాయం అయినట్టే.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ జైత్రయాత్ర.. 17 సిరీస్‌ల్లో వరుస విజయాలు!
2013 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియమించబడ్డాడు. అదే ఏడాది ముంబైకి అతడు మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ అందించాడు. 2015, 2017, 2019, 2020లో ముంబైకి హిట్‌మ్యాన్ టైటిల్స్ అందించాడు. రోహిత్ నాయకత్వంలో ముంబై 87 మ్యాచ్‌లు గెలిచి, 67 మ్యాచ్‌లలో ఓడిపోయింది. రోహిత్ గత సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 332 పరుగులు చేశాడు. ఈ సరి కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగనున్న అతడు రెచ్చిపోయే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!