Rohit Sharma: ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు భారత క్రికెట్ జట్టు పూర్తిగా సన్నద్ధం అవుతోంది. జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ లీడ్ చేయబోతున్నాడు. మొదటి టెస్టులో కెప్టెన్‌గా రోహిత్ గైర్హాజరీతో జస్ప్రీత్ బుమ్రా బాధ్యతలు చేపట్టాడు. అతను భారత్‌ను విజయపథంలో నడిపించాడు. ఇప్పుడు రోహిత్ శర్మకు పరీక్ష ఉండనుంది. ఎందుకంటే, తన కెప్టెన్సీలో టీమిండియాను గెలిపించడమే కాకుండా.. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు చేయలేని పనిని చేయాలన్నది రోహిత్ శర్మ ముందున్న సవాల్.
Also Read: IPL 2025: లక్నో కెప్టెన్ పంత్, పూరనా..? సంజీవ్ గోయెంకా ఆన్సర్ ఇదే
అదేంటంటే, రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో మొత్తం 12 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 700 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. వీటిలో మూడు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ కూడా చేశాడు. అతని సగటు 33.71గా ఉంది. అయితే, ఇక్కడ టెన్షన్ విషయమేమిటంటే.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అతను సాధించిన ఒక్క సెంచరీ అతని స్వదేశంలో అంటే భారత్‌లో చేసిందే. కాబట్టి, ఆస్ట్రేలియాలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 14 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో అతను 408 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. కానీ, ఒక సెంచరీ చేయలేదు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో చేసిన అత్యధిక స్కోరు 63 పరుగులు నాటౌట్ మాత్రమే. రోహిత్ శర్మ ఇప్పుడు సిరీస్‌లోని మిగిలిన నాలుగు మ్యాచ్‌లు ఆడి ఇప్పటి వరకు చేయలేని పని ఇప్పుడు జరగాలి.
Also Read: Pneumonia In Children: చలి వణికించేస్తోంది.. పిల్లలలో ఎక్కువతున్న న్యుమోనియా.. జాగ్రత్త సుమీ
పింక్ బాల్ టెస్టులో రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో ఆడుతాడని వార్తలు వచ్చాయి. ఎందుకంటే, తొలి టెస్టులో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ లు ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ఈ జోడి రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాబట్టి దీనిని తారుమారు చేయరేమో అనిపిస్తోంది.