Hardik Pandya and Suryakumar Yadav have been ruled out: ఏడాదికి పైగా విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పునరాగమనం చేశారు. స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో ఈ ఇద్దరికి చోటు దక్కింది. ఈ సిరీస్‌కు హిట్‌మ్యానే కెప్టెన్ కూడా. దాంతో అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ వీడింది. ఇక టీ20 జట్టులోకి కోహ్లీ, రోహిత్ పునరాగమనంతో ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరూ ఆడబోతున్నారని బీసీసీఐ హింట్ ఇచ్చింది.
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం 16 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. గాయాల కారణంగా టీ20 స్టార్స్ హార్దిక్ పాండ్య, సూర్యకుమార్, రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యారు. గత టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 ఫార్మాట్లో హార్దిక్, సూర్య కెప్టెన్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్, దక్షిణాఫ్రికాలో సూర్యకు గాయమైన నేపథ్యంలో బీసీసీఐ తిరిగి రోహిత్ శర్మకే జట్టు పగ్గాలు అప్పగిచింది. టీ20 ప్రపంచకప్‌లోనూ అతనే కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది.
మానసిక ఆందోళన కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడని ఇషాన్ కిషన్.. అఫ్గాన్‌తో టీ20లకు ఎంపిక కాలేదు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మలను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేసారు. శాంసన్ తుది జట్టులో ఆడనున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబెకు అవకాశం దక్కింది. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లకు విశ్రాంతిని ఇచ్చింది. మొహమ్మద్ షమీ గాయం నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే. అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ బౌలర్లుగా ఎంపికయ్యారు.
Also Read: Life Insurance : కోవిడ్ బారిన పడిన బీమా కంపెనీలు.. రూ.19 వేల కోట్లు తగ్గిన క్లెయిమ్‌లు
భారత టీ20 జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, సంజు శాంసన్ (కీపర్), రింకు సింగ్, జితేశ్ శర్మ (కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్.