Site icon NTV Telugu

Rohit Sharma: వాంఖడేలో ‘రోహిత్ శర్మ’ స్టాండ్‌ ఆవిష్కరణ.. క్రికెట్ దిగ్గజాల సరసన హిట్ మ్యాన్

Rohit

Rohit

టీం ఇండియాకు 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ కృషికి ఫలితం దక్కింది. వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్ కు హిట్ మ్యాన్ పేరు పెట్టారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద ఉన్న స్టాండ్‌ను శుక్రవారం ప్రారంభించారు. మే 16వ తేదీ శుక్రవారం నాడు, రోహిత్ శర్మ తల్లిదండ్రులు రిబ్బన్ కట్ చేసి స్టాండ్‌ను ప్రారంభించారు. రోహిత్ శర్మ పేరుతో ఒక స్టాండ్‌ను ఆవిష్కరించడంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఆయనకు సముచిత గౌరవం ఇచ్చింది.

Also Read:Minister Dola Bala Veeranjaneya Swamy: దివ్యాంగులపై సర్కార్‌ కీలక నిర్ణయం..

ప్రారంభోత్సవం సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. తన పేరు దిగ్గజాల మధ్య నిలిచి ఉండటం పట్ల కలిగే అనుభూతిని మాటల్లో వ్యక్తపరచలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్, ప్రస్తుత ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్, అనేక మంది అధికారులు పాల్గొన్నారు. గతంలో వాంఖడే స్టేడియంలోని స్టాండ్‌లకు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విజయ్ మర్చంట్, దిలీప్ వెంగ్‌సర్కార్ వంటి అనేక మంది క్రికెట్ దిగ్గజాల పేర్లు పెట్టారు.

Also Read:Pakistan: భారత్‌ని మరిచిపోండి, పాకిస్తాన్ ఈ రెండు రాష్ట్రాల GDPని కూడా దాటలేదు..

రోహిత్ శర్మ మాట్లాడుతూ.. “ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు. చిన్నప్పుడు నేను ముంబై, ఇండియా తరపున క్రికెట్ ఆడాలని అనుకున్నాను. కానీ వాంఖడే స్టేడియంలో నా స్టాండ్ ఉంటుందని కలలో కూడా ఊహించలేదు”. అని రోహిత్ వెల్లడించాడు. రోహిత్ భావోద్వేగ ప్రసంగం చేసి, సమీప భవిష్యత్తులో వాంఖడే స్టేడియంలో భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాలనే కోరికను వ్యక్తపరిచాడు.

Exit mobile version