Site icon NTV Telugu

Rohit Sharma: ‘మేం వచ్చేస్తాం.. పదండి ఉప్పల్‌కు’ అంటున్న రోహిత్ శర్మ

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: ఐపీఎల్‌ 2023లో భాగంగా హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో మరో మ్యాచ్‌ జరగబోతోంది.. ముంబై ఇండియన్స్‌తో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ ఢీకొనబోతోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు జట్ల ప్రదర్శనకు పెద్ద తేడా ఏమీ లేదు.. ముంబై నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించగా.. హైదరాబాద్‌ కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మ్యాచ్‌ను చూసేందుకు నగరవాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.. ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి.

Read Also: Dhoni : రిటైర్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ధోని

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్టార్ ఆటగాళ్లంతా ఫామ్‌లోకి వచ్చారు. మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్ జట్టు సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు చేరుకోగానే ఒక్కసారిగా సందడి నెలకొంది. ఎయిర్‌పోర్ట్‌లో రోహిత్ శర్మ, సచిన్ టెండుల్కర్ లనూ చూసి అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. రోహిత్ శర్మను అభిమానులు హిట్‌మ్యాన్‌ అంటూ కేకలు వేశారు. రోహిత్ శర్మ అభిమానులకు అభివాదం చెప్తూ ముందుకు కదిలాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడిన వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోకు క్యాప్షన్ కూడా ‘కెప్టెన్ రోహిత్‌ హైదరాబాద్ వచ్చేసాడు’అని తెలుగులో పెట్టింది. ఈ వీడియోలో రోహిత్ మాట్లాడుతూ..’ముంబై ఫ్యాన్స్.. మేం వచ్చేస్తాం.. పదండి ఉప్పల్‌కు’అని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also: R Ashwin Daughter : తండ్రి అవుటవ్వగానే బోరున ఏడ్చేసిన కూతురు

Exit mobile version