NTV Telugu Site icon

Rohit Sharma Retirement: టెన్షన్ వద్దు.. ఇంకొంత కాలం ఆడతా: రోహిత్

Rohit Sharma Speech

Rohit Sharma Speech

Rohit Sharma React on Retirement: భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ.. పొట్టి ఫార్మాట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హిట్‌మ్యాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్‌లలో మాత్రం ఆడుతానని రోహిత్ స్పష్టం చేశాడు. అయితే టెస్ట్, వన్డే ఫార్మాట్ల నుంచి కూడా రోహిత్‌ త్వరలోనే తప్పుకుంటాడని సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్‌కు గుడ్‌బై చెప్పే సమయం దగ్గరపడిందంటూ పలువురు అంటున్నారు.

వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25కి కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జైషా ఇటీవల స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి రిటైర్‌మెంట్‌పై రోహిత్‌ తాజాగా స్పందించాడు. టెన్షన్ వద్దని, ఇంకొంత కాలం తాను క్రికెట్ ఆడతానని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. డాలస్‌లో క్రికెట్‌ అకాడమీ ప్రారంభానికి వెళ్లిన రోహిత్.. అక్కడ అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ‘నేను ఇంకొంత కాలం క్రికెట్ ఆడతా. సుదీర్ఘ ప్రణాళికలేమీ లేవు. ప్రస్తుతానికి నా దృష్టి అంత క్రికెట్‌పైనే’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రోహిత్ జవాబిచ్చాడు. ఐపీఎల్‌లో ఇంకొన్నాళ్లు హిట్‌మ్యాన్ కొనసాగనున్నాడు.

Also Read: Gold Rates Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!

జులై చివరలో శ్రీలంక టూర్‌కు భారత జట్టు వెళ్లనుంది. ఈ సిరీస్‌ నుంచి రోహిత్‌ శర్మ విశ్రాంతిని తీసుకునే అవకాశం ఉంది. శ్రీలంక టూర్ అనంతరం జరిగే బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా సిరీస్‌లలో రోహిత్ ఆడనున్నాడు. శ్రీలంక టూర్‌కు విరాట్ కోహ్లీ కూడా అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువ. ఇక శ్రీలంక టూర్‌ నుంచే కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ బాధ్యతలు స్వీకరించనున్నాడు.