Site icon NTV Telugu

Rohit Sharma : ఆందోళన ఎందుకు.. ఎలా ఆడాలో మాకు తెలుసు..

Rohit Sharma

Rohit Sharma

మరో 24 గంటల్లో ( రేపటి ) నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కు తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్ లో నాలుగు సార్లు టైటిల్ విన్నర్ సీఎస్కే, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక 16వ సీజన్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్వహకులు ప్లాన్ చేశారు. మరి ఈసారి ఎవరు ఫెవరేట్ అనేది కాస్త కష్టమైన విషయం. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ గత రెండు సీజన్ల నుంచి ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు.. గతేడాది దారుణ ఆటతీరు కనబరిచి ముంబై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.

Also Read : AdiPurush: శ్రీరామనవమి కానుక.. సీతారాముల కొత్త పోస్టర్.. ఆదిపురుష్ రిలీజ్ ఎప్పుడంటే..

అయితే ఈసారి మాత్రం తాము కచ్చితంగా టైటిల్ గెలుస్తామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్ తో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ను ఆరంభించనుంది. కాగా రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ప్రతి మ్యాచ్ లో బరిలో దిగేముందు తమపై భారీ అంచనాలు ఉంటాయని.. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ తెలిపాడు. ఎన్నో సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్న తనకు ఇతరుల అంచనాల గురించి ఆందోళన లేదని, అనవసర ఆలోచనలతో ఒత్తిడి పెంచుకోనని.. ఎలా ఆడితే మళ్లీ విజేతగా నిలుస్తామో అనే అంశం గురించే ఆలోచిస్తామని ఐదుసార్లు ముంబై జట్టును ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ వ్యాఖ్యానించాడు.

Also Read : Duronto Express: బొలెరోను ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్‌.. భీమడోలులో నిలిచిపోయిన రైలు

Exit mobile version