NTV Telugu Site icon

Rohit Sharma: ఆ ఆలోచనే లేదు.. అప్పటివరకు నేను క్రికెట్ ఆడుతాను.. రోహిత్ శర్మ..!

13

13

తాను ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన చేయట్లేదు అంటూ రోహిత్ శర్మ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇకపోతే తన వరల్డ్ కప్ నెరవేరకుండా రిటైర్ అయ్యే ప్రసక్తే లేదంటూ ఖరాకండిగా రోహిత్ శర్మ మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం 37 ఏళ్ల రోహిత్ శర్మ.. ఇక రిటైర్మెంట్ దగ్గర పడిందని., ఇక ఎక్కువ రోజులు క్రికెట్ ఆడటం కష్టమే అన్న భిన్నభిప్రాయాల మధ్య ఇంటర్వ్యూలో భాగంగా ఆయన స్పందించాడు. ఇందులో భాగంగానే అతడు వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలవాల్సిందే అని స్పష్టం చేశాడు.

ఇకపోతే ధోని సారధిలో 2007 లో వరల్డ్ కప్ గెలిచిన టీంలో రోహిత్ శర్మ టీమిండియాలో ఒక సభ్యుడు. అయితే ఆ తర్వాత 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రోహిత్ శర్మకు స్థానం దక్కలేదు. అయితే ఆ తర్వాత టీమిండియా ఏ మెగా టోర్నీ గెలవలేదు. ఇకపోతే ఈ నేపథ్యంలో గత ఏడాది సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు వెళ్లినా దురదృష్టం కొద్దీ ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించి ఆరోసారి ప్రపంచకప్ ను చేజిక్కించుకుంది. దాంతో రోహిత్ శర్మ వరల్డ్ కప్ కలగానే మిగిలిపోయింది.

ఇకపోతే 2027 లో జరిగే సౌతాఫ్రికా వేదికగా తాను ఆడుతానన్నట్లుగా రోహిత్ తెలిపాడు. బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే షోలో పాల్గొన్న రోహిత్ శర్మ ఈ విధంగా స్పందించాడు. తాను ఇప్పుడే రిటైర్మెంట్ గురించి అసలు ఆలోచించడం లేదని.. కాకపోతే జీవితం మనల్ని ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో తెలియదంటూ ఇప్పటికి నేను బాగానే ఆడుతున్నాను. మరికొన్ని ఏళ్ల పాటు కూడా తాను ఇలాగే ఆడతానంటూ తెలిపాడు. అయితే ఆ తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ.. తాను మాత్రం కచ్చితంగా వరల్డ్ కప్ గెలవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. వచ్చే ఏడాది డబ్ల్యూటీసి టెస్ట్ ఫైనల్ కూడా ఉంది. అందులో ఆడెందుకు టీమిండియా ఫైనల్ చేరుతుందని ఆశిస్తున్నట్లు రోహిత్ తెలిపాడు.