NTV Telugu Site icon

Rohit Sharma: వరుస విజయాలు.. భారత్ గేమ్‌ ప్లాన్‌ ఏంటో చెప్పేసిన రోహిత్!

Rohit

Rohit

Rohit Sharma React on India Wins in ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో సునాయాసంగా సెమీస్‌కు చేరింది. లీగ్‌ స్టేజ్‌లో ఒక్క ఓటమీ లేకుండానే.. విజయ పరంపర కొనసాగించింది. ముందుగా బ్యాటింగ్ చేసినా లేదా బౌలింగ్ చేసినా ప్రత్యర్థులను చిత్తుచేసింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌పై భారత్ 160 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెమీస్‌కు చేరుకోవడంపై స్పందించాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో తామ గేమ్‌ ప్లాన్‌ ఏంటనేది కూడా వెల్లడించాడు.

‘వన్డే ప్రపంచకప్‌ 2023 ఆరంభం నుంచి మా గేమ్‌ ప్లాన్‌ ఒకటే. ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెట్టాం, అందులో విజయం సాధించడానికి ఏం చేయాలనే దానిపైనే ఆలోచించాం. ఇది సుదీర్ఘమైన టోర్నమెంట్ కాబట్టి.. ఫైనల్ గురించి ముందే ఆలోచించలేదు. ముందుగా సెమీస్ లక్ష్యం పెట్టుకున్నాము. సెమీస్ చేరాం కాబట్టి ఇప్పుడు మా టార్గెట్ ఫైనల్. చాలా వేదికల్లో విభిన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాం. లీగ్‌ స్టేజ్‌లో భారత్ 9 మైదానంలలో మ్యాచ్‌లను ఆడింది. అన్నింట్లో విజయం సాధించడం ఆనందంగా ఉంది. అయితే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవడం సంతోషంగా ఉంది. స్వదేశంలో ఎక్కువగా మ్యాచ్‌లు ఆడటం వల్ల ఇక్కడి పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఛేజింగ్‌ చేసి విజయాలు అందుకున్నాము. ఆ తర్వాత ముందుగా బ్యాటింగ్‌ చేసినప్పుడు స్కోరు బోర్డుపై మోస్తరు పరుగులు ఉన్నా.. మా బౌలర్లు గెలిపించారు. మా పేసర్లు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు’ అని రోహిత్ తెలిపాడు.

Also Read: Kohli-Anushka: ఏంటి అనుష్క.. కనీసం చప్పట్లు కూడా కొట్టావా! కోహ్లీ వీడియో వైరల్

‘ప్రతి ఒక్కరూ విజయం కోసం బాధ్యత తీసుకోవడం జట్టుకు ఓ మంచి సంకేతం. మైదానంలో, డ్రెస్సింగ్‌ రూమ్‌లో జట్టు సభ్యుల మధ్య మంచి వాతావరణం ఉండడమే మా విజయాలకు మరో కారణం. ఇదే ఫామ్ టోర్నీ చివరి వరకూ కొనసాగిస్తాం. మాపై చాలా అంచనాలు ఉన్నా.. అన్నింటినీ పక్కనపెట్టి పనిపై మాత్రమే దృష్టి పెట్టాలనుకుంటున్నాము. మేము చాలా సరదాగా, ఉత్సాహంగా మైదానంలో గేమ్‌ను ఆడాలనుకున్నాము. అందరూ స్వేచ్ఛగా ఆడుతున్నారు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగినప్పుడు స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంటే.. వారిపై ఒత్తిడి ఉండదు. మాకు ఇపుడు తొమ్మిది మంది బౌలర్లు ఉన్నారు. సీమర్లు, స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తూ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తున్నారు’ అని రోహిత్ శర్మ చెప్పాడు.