Site icon NTV Telugu

Rohit Sharma: ముంబైకి తలనొప్పిగా రోహిత్ శర్మ.. 2020 నుంచి ఒక్కసారి మాత్రమే!

Rohit Sharma Mi

Rohit Sharma Mi

ఇటీవలి కాలంలో హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ పెద్దగా ఫామ్‌లో లేడు. టీమిండియా తరఫున అయినా, ఐపీఎల్‌లో అయినా అడపాదడపా ఇన్నింగ్స్ తప్పితే.. నిలకడగా రాణించిన దాఖలు లేవు. ఐపీఎల్ 2025లోనూ హిట్‌మ్యాన్‌ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో 21 పరుగులు మాత్రమే చేశాడు. గుజరాత్‌పై 8, చెన్నైపై 0, కోల్‌కతాపై 13 రన్స్ చేశాడు. ఈ మూడు ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఫాస్ట్ బౌలర్‌కు వికెట్స్ ఇవ్వడం విశేషం.

గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌లో రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కొనసాగుతోంది. ఐపీఎల్ 2020 నుంచి ఇప్పటివరకు హిట్‌మ్యాన్‌ 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భాలు 8 మాత్రమే ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 105 నాటౌట్. ఈ స్కోర్ గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై అతను చేశాడు. గత ఐదు ఐపీఎల్ సీజన్లలో రోహిత్ ఒకే ఒక్కసారి మాత్రమే 400 పరుగుల మార్కును దాటాడు. 2020లో 332, 2021లో 381, 2022లో 268, 2023లో 332, 2024లో 417 రన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో అతని ప్రస్తుత ప్రదర్శనపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read: Ashwani Kumar: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన అశ్వని కుమార్.. తొలి మ్యాచ్‌లోనే..!

కోల్‌కతాపై ముంబై ఇండియన్స్‌ తుది జట్టులో రోహిత్ శర్మ పేరు లేదు. విల్ జాక్స్ తుది జట్టులోకి రాగా.. అశ్వని కుమార్ అరంగేట్రం చేశాడు. విజ్ఞేష్ పుతుర్ కూడా తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. హిట్‌మ్యాన్‌ ఇంపాక్ట్ ప్లేయర్‌గా రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ను నెటిజెన్స్ ఆడేసుకుంటున్నారు. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ తలనొప్పిగా మారాడా? అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు రోహిత్ ఫాన్స్ మాత్రం అతడికి అండగా నిలుస్తున్నారు. రోహిత్ ఫామ్ అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హిట్‌మ్యాన్‌.. ఓ సెంచరీతో అందరి నోళ్లు మూయించిద్దాం అని కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version