Site icon NTV Telugu

Rohit Sharma Perth Century: తొమ్మిదేళ్ల క్రితం పెర్త్‌లో హిట్‌మ్యాన్ విజయగర్జన..

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma Perth Century: టీమిండియా క్రికెట్ అభిమానులందరూ ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుచుకునే రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోహిత్ బ్యాట్ ఝుళిపించాడు అంటే అవతలి జట్టుకు ఓటమి లాంఛనమే అనే రీతిలో రికార్డులను నెలకొల్పాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ అనేకసార్లు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పటికీ.. జనవరి 12, 2016 మాత్రం క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ప్రత్యేకం. ఎందుకంటే ఆ రోజు హిట్‌మ్యాన్ పెర్త్‌లోని చారిత్రాత్మక WACA మైదానంలో ఆస్ట్రేలియన్ టీంను వారి స్వంత గడ్డపై ఓడించాడు. ఆ రోజు రోహిత్ బ్యాటింగ్ చేసిన విధానం భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

READ ALSO: Deputy CM Pawan Kalyan: ప్రధాని మోడీ ఒక కర్మయోగి.. ఏపీలో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం ఉండాలి..

పెర్త్ పిచ్‌పై రోహిత్ శర్మ విశ్వరూపం..
ఆస్ట్రేలియా సిరీస్‌లోని మొదటి వన్డే జనవరి 12, 2016న పెర్త్‌లోని WACA మైదానంలో జరిగింది. సాధారణంగా రోహిత్ శర్మ అన్ని మ్యాచ్‌ల్లాగానే ఆ రోజు కూడా బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు.. కానీ ఆ రోజు ఎవరికీ తెలియదు.. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ షో టీమిండియా క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటుందని.. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలింగ్‌పై రోహిత్ సెంచరీ చేసిన విధానం.. ఓవరాల్ ఆటకే హైలేట్. ఫాస్ట్, బౌన్సీ పెర్త్ పిచ్‌పై రోహిత్ ప్రదర్శించిన ప్రశాంతత, సమయానికి తగిన దూకుడు వేరే స్థాయిలో ఉన్నాయని అంటే అతిశయోక్తి కాదు. ఈ మ్యాచ్ హిట్‌మ్యా్న్ 171 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, ఆస్ట్రేలియన్ టీంలోని ప్రతి బౌలర్‌ను చీల్చిచెండాడు. ఆ ఇన్నింగ్స్‌లో రోహిత్ 13 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు.

ఆస్ట్రేలియన్ బౌలింగ్ టీంలో హాజిల్‌వుడ్, బోలాండ్, మిచెల్ మార్ష్, ఫాల్క్‌నర్ వంటి మేటి బౌలర్లను రోహిత్ శర్మ ఎదుర్కొన్న విధానం ఈ ఆటలో అతిపెద్ద హైలైట్. రోహిత్ బంతిని లైన్ దాటి పంపడమే కాకుండా, పరిస్థితిని బట్టి దృఢమైన షాట్లగా మలిచి, మంచి వ్యూహంతో ఆస్ట్రేలియా బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. రోహిత్ శర్మ క్రికెట్ జర్నీలో ఈ ఇన్నింగ్స్‌కు ప్రత్యేకత ఉంటుదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మళ్లీ అదే సీన్ రిపిట్ అవుతుందా..
తాజాగా 2025 లో పెర్త్ మైదానంలో భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈక్రమంలో రోహిత్ మనస్సులో ఎక్కడో ఒక మూలలో WACAలో ఆడిన నాటి ఇన్నింగ్స్ గుర్తులు, మంచి జ్ఞాపకాలు ఉంటాయని స్పష్టంగా తెలుస్తుంది. 2025లో భారత జట్టు అదే పెర్త్ నగరంలోని కొత్త మైదానంలో తొమ్మిది ఏళ్ల తర్వాత సిరీస్ మొదటి మ్యాచ్ ఆడుతుంది. పెర్త్ పిచ్‌లో ఎల్లప్పుడూ ఫాస్ట్ బౌలింగ్ ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ ఫాస్ట్, బౌన్సీ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్‌ ఆడటం పెద్ద సవాలు అవుతుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఇప్పుడు టీంలో రోకో(రోహిత్-కోహ్లి) జోడి తిరిగి రావడం జట్టుకు అతిపెద్ద బలంగా మారనుందని అభిమానులు, క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాటి ప్రత్యేక విజయాన్ని గుర్తు చేస్తూ మళ్లీ హిట్‌మ్యాన్ అప్పటి సీన్ రిపిట్ చేస్తాడా అనేది చూడాలి.

READ ALSO: JFK Assassination Documents: ట్రంప్ రాజకీయ వ్యూహానికి పుతిన్ ఫైల్ బాంబు దెబ్బ..

Exit mobile version