ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. చివరి వరకు ఎంతో ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్.. 6 వికెట్ల నష్టానికి భారత్ 254 పరుగులు సాధించిన విజయ కేతనాన్ని ఎగురవేసింది. దీంతో.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని కైవసం చేసుకుంది. టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. విజయనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. శ్రేయాస్ అయ్యర్‌ను సైలెంట్ హీరో అని వ్యాఖ్యానించాడు. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో టీమిండియాకు సైలెంట్ హీరోగా నిలిచిన ఆటగాడిగా రోహిత్ శర్మ శ్రేయాస్ అయ్యర్‌ను సెలక్ట్ చేశాడు. అతని గురించి ఎక్కువ మాట్లాడ లేకపోయినా.. అతను తన పనిని పూర్తి అంకితభావంతో చేశాడని రోహిత్ శర్మ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో భారత్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కీలక సమయంలో మద్దతు ఇచ్చాడని పేర్కొన్నాడు.
Read Also: SK : నేచురల్ స్టార్ నాని బాటలో కోలీవుడ్ స్టార్ హీరో.. వర్కౌట్ అవుతుందా..?
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. “భారత్ జట్టు గురించి నాకు చాలా గర్వంగా ఉంది. పరిస్థితులు కఠినంగా ఉంటాయని మాకు తెలుసు, కానీ మేము బాగా అలవాటు పడ్డాము. మీరు అన్ని మ్యాచ్‌లను పరిశీలిస్తే, మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరిగింది. అందులో కేవలం 230 పరుగులు మాత్రమే, కానీ వికెట్ కొంచెం నెమ్మదిగా ఉందని మాకు తెలుసు. మాకు భాగస్వామ్యాలు అవసరం. బ్యాట్స్‌మెన్లు పెద్ద పార్టనర్ షిప్‌లు చేశారు. టోర్నమెంట్ మొత్తం శ్రేయాస్ అయ్యర్‌ను మర్చిపోకూడదు. అతను అద్భుతంగా ఆడాడు. మిడిల్ ఆర్డర్‌లో అతను మాకు చాలా ముఖ్యం. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్‌లో అతను మంచి పార్టనర్ షిప్ అందించాడు.” అని రోహిత్ శర్మ తెలిపాడు.
Read Also: Posani Krishna Murali: పోసాని క్వాష్ పిటిషన్లపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
టోర్నమెంట్ మొత్తం.. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. అతను టీమిండియాకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ ఫైనల్‌లో మినహాయించి సెమీ-ఫైనల్స్, లీగ్ మ్యాచ్‌లలో అనేక కీలక భాగస్వామ్యాలను అందించాడు. దీంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. కాగా.. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లలో 241 పరుగులు చేసిన అయ్యర్.. రచిన్ రవీంద్ర తరువాత అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.