NTV Telugu Site icon

Asia Cup Final: మరో 33 పరుగులే.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డుపై రోహిత్ కన్ను! సమీపంలోనే ఎవరూ లేరు

Rohit Gill

Rohit Gill

Rohit Sharma On Verge Of Sachin Tendulkar’s Asia Cup Record: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఆసియా కప్ వన్డే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచే అవకాశం రోహిత్ ముందుంది. భారత్, శ్రీలంక మధ్య ఈ రోజు జరిగే ఆసియా కప్ 2023 ఫైనల్‌లో రోహిత్ 33 పరుగులు చేస్తే.. ఈ రికార్డు హిట్‌మ్యాన్ ఖాతాలో చేరుతుంది. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు అవుతుంది.

ఆసియా కప్ టోర్నీ వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున 23 వన్డేలు ఆడిన సచిన్.. 2 సెంచరీలు, 7 అర్థ సెంచరీలతో 971 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో భారత్ తరఫున ఇప్పటివరకు 27 వన్డేలు ఆడిన రోహిత్ శర్మ.. 1 సెంచరీ, 9 అర్థ సెంచరీలతో 939 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఆసియా కప్ 2023 ఫైనల్‌లో రోహిత్ 33 పరుగులు చేస్తే సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అవుతుంది.

ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసిన సచిన్ టెండ్యూలర్, రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో ఉన్న వారు ఈ ఇద్దరి సమీపంలో లేరు. 15 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీతో 742 పరుగులు చేసిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీరిద్దరికి చాలా దూరంలో ఉన్నాడు. సచిన్ రికార్డు బద్దలు కొట్టాలంటే నేటి మ్యాచ్‌లో కోహ్లీ 229 పరుగులు చేయాల్సి ఉంది. ఇక ఆసియా కప్ వన్డే టోర్నీలో అత్యధిక పరుగులు చేసింది శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య. 24 మ్యాచ్‌ల్లో 1220 రన్స్ చేశాడు. 23 మ్యాచ్‌ల్లో 1075 రన్స్ చేసిన కుమార సంగక్కర రెండో స్థానంలో ఉన్నాడు.

Also Read: Pakistan Cricket: పాకిస్తాన్ క్రికెట్‌లో దుమారం.. ఆటగాళ్లను తిట్టి పారిపోయిన బాబర్ ఆజమ్!

ఆసియా కప్ (వన్డే)లో భారత్ తరఫున అత్యధిక పరుగులు (Most Runs For India In Asia Cup):
సచిన్ టెండూల్కర్ – 971 పరుగులు
రోహిత్ శర్మ – 939 పరుగులు
విరాట్ కోహ్లీ – 742 పరుగులు
ఎంఎస్ ధోనీ – 648 పరుగులు
గౌతమ్ గంభీర్ – 573 పరుగులు