Site icon NTV Telugu

Rohit Sharma: స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ ఫైర్.. ఎందుకో తెలుసా..?

Rohit

Rohit

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌ పేలవ ప్రదర్శన చేసింది. ఈ సీజన్‌ను ఓటమితో ముగించింది. శుక్రవారం వాంఖడేలో లీగ్ ఆఖరి మ్యాచ్ ఆడిన ముంబై.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓడిపోయింది. లక్నోపై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పేలవ ప్రదర్శనతో ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ముంబై 14 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్ల ఖాతాలో వేసుకుంది. గత మూడు సీజన్‌లుగా ముంబై ప్లేఆఫ్స్‌ చేరని విషయం తెలిసిందే.

Janhvi Kapoor: 13 ఏళ్లకే పోర్న్ సైట్లో ఫోటోలు… నా ఫ్రెండ్స్ కూడా చూశారు… జాన్వీ కపూర్ ఎమోషనల్

అయితే మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ తన స్నేహితులతో మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ముంబై మాజీ ఫాస్ట్ బౌలర్ ధావల్ కులకర్ణితో రోహిత్ మాట్లాడాడు. ఇంతలో కెమెరామెన్ వారి సంభాషణను రికార్డ్ చేయడం రోహిత్ చూశాడు. కాగా.. ఆ ఆడియోను రికార్డ్ చేయవద్దని రోహిత్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో.. రోహిత్ శర్మ స్టార్ స్పోర్ట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్నేహితులు, తోటి ప్లేయర్లతో సంభాషణలను రికార్డు చేయడంతో క్రికెటర్ల జీవితాలకు గోప్యత లేకుండా పోయిందని ట్వీట్ చేశారు.వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయొద్దని.. ఏదొక రోజు ఫ్యాన్స్, క్రికెటర్లు, క్రికెట్ మధ్య విశ్వాసాన్ని బ్రేక్ చేస్తాయని తెలిపారు.

Prarthana Chabbria: అందాలతో కనువిందు చేస్తున్న ప్రార్థన చబ్రియా…

అంతకుముందు కోల్‌కతా కోచ్ అభిషేక్ నాయర్‌తో సంభాషణ వైరల్‌గా మారిన విషయం గుర్తుకొచ్చి.. సదరు కెమెరామన్‌కు రోహిత్ సరదాగా ఓ విజ్ఞప్తి చేశాడు. ‘‘బ్రదర్‌ ప్లీజ్‌ ఆడియోను క్లోజ్‌ చేయి. ఇప్పటికే ఒకటి నెట్టింట వైరల్‌గా మారిపోయింది. దీంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి’’ అని రోహిత్ తెలిపాడు.

Exit mobile version