NTV Telugu Site icon

Rohit Shama: శ్రేయాస్ని ఇమిటేట్ చేసిన రోహిత్.. వీడియో వైరల్

Ayyar Imitate

Ayyar Imitate

వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఓటమెరుగని జట్టుగా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో వరుసగా పదికి పది మ్యాచులు గెలిచి టీమిండియా రికార్డులు సృష్టించింది. జట్టులో ప్రతి ఒక్కరు విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. ఇక నిన్న జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. ఇక వరల్డ్ కప్ ను ముద్దాడేందుకు కేవలం అడుగు దూరంలో ఉంది. ఇదిలా ఉంటే.. కివీస్ తో జరిగిన నాకౌట్ మ్యాచ్ లో క్రెడిట్ అయ్యర్ కి కూడా ఇవ్వాలి. నిజానికి భారత్ విజయం వెనుక కీలకపాత్ర పోషించి అయ్యర్ అనే చెప్పాలి.

SA vs AUS: ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం.. సెంచరీతో రాణించిన డేవిడ్ మిల్లర్

న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ(117), శ్రేయాస్ అయ్యర్(105) శతకాలతో అదరగొట్టారు. అటు బౌలింగ్ లో షమీ 7 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ, షమీ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు అందరూ అంటున్నారు. కానీ.. వీళ్ల కంటే కూడా శ్రేయాస్ అయ్యర్ ఒకింత ఎక్కువ కంట్రిబ్యూట్ చేశాడు. అయ్యర్ నిన్నటి మ్యాచ్ లో ఎంతో వేగంగా ఆడాడు. కేవలం 70 బంతుల్లోనే 8 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. నాకౌట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ని చూస్తే ఒకానొక సమయంలో టీమిండియా అభిమానులు టెన్షన్ కు గురయ్యారు. మ్యాచ్ చేజారిపోతుందనే అభిప్రాయం ఏర్పడింది. కానీ, షమీ అటాకింగ్ బౌలింగ్ తో ఆ ప్రమాదం తప్పింది. అయితే ఇక్కడ శ్రేయాస్ అయ్యర్ చేసిన గొప్ప పని ఏంటంటే.. అత్యంత వేగంగా పరుగులు చేయడం. కోహ్లీతో కలిసి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించడం. అతను అలా చేయబట్టే టీమిండియాకి మంచి స్కోర్ దక్కింది. అయ్యర్ గనుక స్లోగా ఆడుంటే భారత్ ఇంత మంచి స్కోర్ చేయగలిగేది కాదేమో? ఒకవేళ అయ్యర్ చాలా తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరుంటే మ్యాచ్ ఫలితం రివర్స్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండేది కాదు.

Allu Sirish: మంచక్క కు ముద్దు.. తారక్ అన్నకు హగ్గు.. అదిరిందయ్యా శిరీష్

ఇక.. టీమిండియా కెప్టెన్ ను కూడా మెచ్చుకోవాలి. అయ్యర్ కు రోహిత్ సపోర్ట్ ఇవ్వడం వల్లే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఎంతమంది అయ్యర్ టాలెంట్ ని శంకించినా కూడా రోహిత్ మాత్రం అతడికి మద్దతు తెలిపాడు. అలా రోహిత్ చూపించిన నమ్మకమే ఇలా నాకౌట్ మ్యాచ్ లో టీమిండియా విజయానికి బాటలు వేసింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో ఇంకో ఫన్నీ విషయం కూడా జరిగింది. సెంచరీ చేసిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాడో అచ్చం అలాగే రోహిత్ శర్మ ఇమిటేట్ చేశాడు. అయ్యర్ ని ఇమిటేట్ చేస్తూ రోహిత్ నడిచిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.