Site icon NTV Telugu

Rocking Rakesh: లండన్ లో రాకేష్-సుజాత.. సడెన్ ట్రిప్ అందుకేనా?

Rakesh Sujatha

Rakesh Sujatha

జబర్దస్త్ కామెడియన్ రాకింగ్ రాకేష్.. జోర్దార్ సుజాత ఇటీవల పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరికీ క్రేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఈ మధ్య విదేశాల్లో తెగ విహరిస్తున్నారు. తన వృత్తిలో భాగంగా ఈవెంట్‌లు చేయడానికి తరచూ రాకింగ్ రాకేష్ విదేశాలు వెళ్తుంటారు. అయితే, ఇప్పుడు తన భార్యతో కలిసి జంటగా వెళ్తున్నారు. సతీమణికి తోడుగా కూడా వెళ్తున్నారు… అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. ఇక ఈ మధ్య రాకేష్ జబర్దస్త్ షోలో కూడా పెద్దగా కనిపించినట్లు లేరు..

ఇది ఇలా ఉండగా..వరంగల్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌.. లండన్‌లో బోనాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించింది. గత పదేళ్లుగా లండన్‌లో బోనాల జాతర నిర్వహిస్తునప్పటికీ.. ఈ ఏడాది మరింతగా ఘనంగా నిర్వహించాలని ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ నిర్ణయించుకుంది. అందుకే యాంకర్, నటి, తెలంగాణ మహిళ అయిన జోర్దార్‌ సుజాత ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు.. అక్కడ హోస్టింగ్ చెయ్యడం కోసం రాకింగ్ రాకేష్ తన భార్యతో కలిసి అక్కడికి వెళ్లారు..అక్కడ దిగిన ఫొటోలను వారు ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం పంచుకున్నారు..

ఇప్పుడే కాదు గతంలో చాలా సార్లు రాకేష్ అక్కడకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు.. ఇండియాలో ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి నా ద్వారా డబ్బు పంపి సహకారం అందించారు. చిన్నారుల చదువు, వైద్యానికి సహకరించారు. ఈసారి బోనాల వేడుకలో మేం భాగం కావాలని వరంగల్‌ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ కోరగా.. గతంలో వారు చేసిన సేవలకు కృతజ్ఞతా భావంతో లండన్‌ షో చేశాం. మమ్మల్ని ఇందులో భాగం కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం లండన్‌లో చేసిన షోతో 2300 షోలను పూర్తి చేశానని రాకేష్ అన్నారు.. మరోవైపు రాకేష్ లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోను వదిలేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..

Exit mobile version