Rocking Rakesh: లండన్ లో రాకేష్-సుజాత.. సడెన్ ట్రిప్ అందుకేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జబర్దస్త్ కామెడియన్ రాకింగ్ రాకేష్.. జోర్దార్ సుజాత ఇటీవల పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరికీ క్రేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఈ మధ్య విదేశాల్లో తెగ విహరిస్తున్నారు. తన వృత్తిలో భాగంగా ఈవెంట్లు చేయడానికి తరచూ రాకింగ్ రాకేష్ విదేశాలు వెళ్తుంటారు. అయితే, ఇప్పుడు తన భార్యతో కలిసి జంటగా వెళ్తున్నారు. సతీమణికి తోడుగా కూడా వెళ్తున్నారు… అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. ఇక ఈ మధ్య రాకేష్ జబర్దస్త్ షోలో కూడా పెద్దగా కనిపించినట్లు లేరు..
ఇది ఇలా ఉండగా..వరంగల్‌కు చెందిన ఎన్ఆర్ఐ ఫోరమ్.. లండన్‌లో బోనాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించింది. గత పదేళ్లుగా లండన్‌లో బోనాల జాతర నిర్వహిస్తునప్పటికీ.. ఈ ఏడాది మరింతగా ఘనంగా నిర్వహించాలని ఎన్ఆర్ఐ ఫోరమ్ నిర్ణయించుకుంది. అందుకే యాంకర్, నటి, తెలంగాణ మహిళ అయిన జోర్దార్ సుజాత ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు.. అక్కడ హోస్టింగ్ చెయ్యడం కోసం రాకింగ్ రాకేష్ తన భార్యతో కలిసి అక్కడికి వెళ్లారు..అక్కడ దిగిన ఫొటోలను వారు ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం పంచుకున్నారు..
Also Read
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
ఇప్పుడే కాదు గతంలో చాలా సార్లు రాకేష్ అక్కడకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు.. ఇండియాలో ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి నా ద్వారా డబ్బు పంపి సహకారం అందించారు. చిన్నారుల చదువు, వైద్యానికి సహకరించారు. ఈసారి బోనాల వేడుకలో మేం భాగం కావాలని వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరమ్ కోరగా.. గతంలో వారు చేసిన సేవలకు కృతజ్ఞతా భావంతో లండన్ షో చేశాం. మమ్మల్ని ఇందులో భాగం కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం లండన్‌లో చేసిన షోతో 2300 షోలను పూర్తి చేశానని రాకేష్ అన్నారు.. మరోవైపు రాకేష్ లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోను వదిలేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!