Site icon NTV Telugu

Jammu

Jammu

Jammu And Kashmir: భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పొతున్నారు. వరదలకు తోడు పిడుగులు పడి కూడా కొంతమంది చనిపోతున్నారు. ఇక వరదల కారణంగా కొండలపై ఉండే పెద్దపెద్ద బండరాళ్లు కిందకు పడుతున్నాయి. కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీని కారణంగా జమ్మూ కశ్మీర్ లో నలుగురు ప్రాణాలు కోల్పొయారు. బనిహాల్ ప్రాంతంలోని షేర్ బీబీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Also Read: Food Poisoning: కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో 80 మంది విద్యార్ధినిలు

ఓ ట్రక్ జమ్మూ నుంచి శ్రీనగర్ కు వెళుతుంది. అయితే రాంబన్ జిల్లా వ్దద భారీ వర్షాల కారణంగా బండరాయి జారి ట్రక్కు మీద పడింది. దీంతో ట్రక్కు లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ట్రక్కు లోతైన లోయలో పడటంతో దానిలో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. లోయలో పడిన మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో మనుషులతో పాటు ట్రక్ లో ఉన్న ఆరు పశువులు కూడా చనిపోయాయి. కొండచరియాలు విరిగిపడటంతో జాతీయ రహదారి-44పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కిష్త్వారీ పథేర్ బనిహాల్ వద్ద కొండచరియలు విరిగిపడిన కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని బ్లాక్ చేశారు.

ఉత్తరప్రదేశ్ లో కూడా వరదల కారణంగా 19 మంది మరణించిన విషయం తెలిసిందే. మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు వాతావరణ శాఖ సూచించింది. ఉత్తరప్రదేశ్ లో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. సెప్టెంబర్ 14 వ తేదీ వరకు భారీ వర్షాలు ఉన్నాయని అవసరమైతే బయటకు రావాలని వాతావరణ శాఖ సూచించింది.

Exit mobile version