NTV Telugu Site icon

Robinhood Trailer: నితిన్ ‘రాబిన్ హుడ్’ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ మాములుగా లేదుగా!

Robinhood

Robinhood

Robinhood Trailer: టాలీవుడ్‌లో ప్రస్తుతం హైప్ క్రియేట్ చేస్తోన్న చిత్రాలలో ‘రాబిన్ హుడ్’ ఒకటి. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నితిన్ కథానాయకుడిగా నటించగా, శ్రీలీల హీరోయిన్‌గా అలరించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు అందించారు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (మార్చి 23) హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించగా.. ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ హాజరయ్యాడు. అతని చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

Read Also: Kadapa ZP Chairman: కడపలో జడ్పీ చైర్మన్ ఎన్నికల వేడి.. క్యాంపు రాజకీయాలకు శ్రీకారం

ఈ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ మరో ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది. ‘రాబిన్ హుడ్’ సినిమాలో డేవిడ్ వార్నర్ సెకండ్ హాఫ్‌లో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లోనూ వార్నర్ కనిపించాడు. హెలికాప్టర్ నుంచి దిగుతూ, లాలీపాప్ తింటూ నడుస్తున్న సన్నివేశంలో అతను కనిపించడం అభిమానులను ఉత్సాహపరచింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. రాబిన్ హుడ్ ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. నితిన్ మార్క్ యాక్షన్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్‌ల కామెడీ, శ్రీలీల గ్లామర్ ఇలా అన్ని రోల్స్ సినిమా పట్ల ఆసక్తిని పెంచాయి. వినోదంతోపాటు యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరి డేవిడ్ వార్నర్ పాత్ర కథకు ఎలాంటి మలుపులు తీసుకురాబోతుందో? రాబిన్ హుడ్ ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరిస్తుందో? తెలియాలంటే మార్చి 28 వరకు వేచి చూడాల్సిందే.