NTV Telugu Site icon

G. V. Prakash Kumar : యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కు ‘రాబిన్ హుడ్’ టీం స్పెషల్ బర్త్ డే విషెస్..

Robinhood (1)

Robinhood (1)

G. V. Prakash Kumar : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు.గత ఏడాది ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.భీష్మ సినిమా తరువాత నితిన్ కు సరైన హిట్ లభించలేదు.తాను చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి.ప్రస్తుతం నితిన్ వరుస సినిమాలలో నటిస్తున్నాడు.దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తమ్ముడు”.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు మరియు శిరీష్ సంయుక్తగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో నితిన్ సరసన కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుంది.

Read Also :lucky Bhaskar : దుల్కర్ “లక్కీ భాస్కర్” మ్యూజికల్ ప్రమోషన్స్ పై స్పెషల్ అప్డేట్..

ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్ర పోషిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే నితిన్ నటిస్తున్న మరో మూవీ “రాబిన్ హుడ్”ఈ సినిమాను తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తుంది.ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మరియు వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.ఇదిలా ఉంటే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ కంపోజర్ జివి ప్రకాష్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది.ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 20 న విడుదల చేయనున్నారు.

Show comments