టాలీవుడ్ లో పెయిడ్ ప్రీమియర్స్ సందడి ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంది. కానీ ఈ రెండు సినిమాలు మాత్రం పెయిడ్ ప్రీమియర్స్ కు దూరంగా ఉన్నాయి. సాధారణంగా పెయిడ్ ప్రీమియర్స్ లో టాక్ బాగుంటే ఓపెనింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అదే కొంచం అటు ఇటు అయితే ఆ ప్రభావం ఓపెనింగ్స్ మీద పడుతుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మిస్టర్ బచ్చన్. ప్రీమియర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓపెనింగ్ రోజు వాషౌట్ అయింది. ప్రీమియర్స్ తేడా కొడితే సోషల్ మీడియాలో రచ్చ కూడా చాలా ఎక్కువ. పోటీగా ఏవైనా సినిమాలు ఉంటే అది ఇంకా ఎక్కవ స్థాయిలో ఉంటుంది.
Also Read : Nizam : నైజాంలో రాబిన్ హుడ్ కు థియేటర్స్ నయ్.. నయ్..
అయితే రాబోతున్న రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ ప్రీమియర్స్ విషయంలో బయపడి వెనక్కితగ్గారు అనే టాక్ వినిపిస్తోంది. రాబిన్ హుడ్ నిర్మాతలు తమకు కలిసి రాలేదని చెప్తున్నా కంటెంట్ విషయంలో ఎక్కడో కాస్త అనుమానం వ్యక్తం చేస్తన్నారు. ఇక మ్యాడ్ స్క్వేర్ కూడా ఫస్ట్ పార్ట్ కంటే కాస్త తగ్గింది అనే టాక్ ఉంది. అందుకోసమే ప్రీమియర్స్ విషయంలో వెనక్కి తగ్గారా అనే అనుమానాలు వస్తున్నాయి. వాస్తవానికి మ్యాడ్ స్క్వేర్ ప్రీమియర్స్ ప్లాన్ చేసారు కానీ చివరి నిమిషంలో వెనక్కి వెళ్లారు. నితిన్ కు ఈ సినిమా చాలా కీలకం. హ్యాట్రిక్ డిజాస్టర్స్ తర్వాత ఎలగైనా హిట్ కొట్టాలని బీష్మ వంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములను నమ్మి రాబిన్ హుడ్ చేసారు. ప్రీమియర్స్ లో ఏదైనా అటు ఇటు అయితే మొదటికే మోసం వస్తుందని నిర్మాతలు బ్యాక్ స్టెప్ వేశారని టాలీవుడ్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి