సంక్రాంతికి ఊరెళితే అదే అదునుగా చూసుకొని దుండగులు ఓ ఇంటిని లూటీ చేశారు. ఇంట్లోకి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి 10 లక్షల నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు ఈ సంఘటన ఇస్నాపూర్ లో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని ఇస్నాపూర్ తేజ కాలనీలో నివాసం ఉంటున్న గోపీచంద్ స్థానికంగా వ్యాపారం చేస్తూ నివాసం ఉంటున్నాడు. సంక్రాంతి పండగ సందర్భంగా వారి స్వగ్రామం అయిన గుంటూరుకు వెళ్లడంతో అదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండగులు ఇంట్లో ప్రవేశించి పది లక్షల నగదు, బంగారు ఆభరణాలను తస్కరించారు.
Also Read : Police Officers Association: పోలీసులను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు తగవు
కాగ ఊరు నుంచి వచ్చి చూసిన గోపీచంద్ ఇల్లంతా పరిశీలించగా సామాన్ల చిందరవందరగా పడి ఉండడంతో బీరువాను పరిశీలించగా అందులో నగదు, బంగారు నగలు కనపడకపోవడంతో ఆందోళన గురయ్యాడు. దీంతో గోపీచంద్ పటాన్‌చెరు పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఈ నేపథ్యంలో.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : PhonePe Blackmail: ఫోన్‌పేలో రోజుకో రూపాయి.. ఆపై బ్లాక్‌మెయిల్..
