Huge Theft: హైదరాబాద్ శివారులో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఒంటరిగా వున్నవారిమీదే టార్గెట్ చేస్తున్నారు. వారిపై దాడి చేసి దొరికినకాటికి దోచుకుంటున్నారు. ఒంటరిగా వ్యక్తి కనిపిస్తే చాలు గుంపులుగా వారిపై దాడిచేసి నగదును కాజేసి పరార్ అవుతున్నారు. అయితే ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా కోకాపేటలో చోటుచేసుకుంది.
Read also: Theppa Samudram: బిగ్ బాస్ అర్జున్ హీరోగా తెప్ప సముద్రం.. 19న రిలీజ్
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ఓవ్యక్తి ఆటో కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి గమనించిన కొందరు దుండగలు ప్లాన్ ప్రకారం అతని వద్దకు వెళ్లారు. మాటలు కలుపుతూ అతనిపై దాడి చేశారు. దొంగలు ఆ వ్యక్తిని ఆటోలో ఎక్కించుకుని అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. బాధితుడి వద్ద నుంచి నగదు ఇవ్వాలని కోరారు. తన దగ్గర లేదని చెప్పినా వినకుండా ఎంత ఉంటే అవి ఇచ్చేయి లేదంటూ చంపేస్తామంటూ పిడుగుద్దులు గుద్దారు అతని జేబులోంచి నాలుగున్నర వేల రూపాయల నగదు తీసుకుని ఆటో వదిలి పారిపోయారు. దీంతో బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చినట్లు గుర్తించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కోకాపేట సర్వీస్ రోడ్డులో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇది వరుసగా ఐదో ఘటన కావడం గమనార్హం. దోపిడీ ముఠాలు ఒంటరి వారినే టార్గెట్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. కోకాపేట వైపు వెళ్లే ప్రయాణికులు, వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అపరచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు.
Read also: Diwali Movies : దీపావళి బరిలో ఐదు క్రేజీ సినిమాలు.. ఆ రెండు స్పెషల్..
మరోవైపు యాదాద్రి జిల్లాలో రాత్రిపూట దొంగతనాలు ఆగడం లేదు. భువనగిరి మున్సిపాలిటీ రాయగిరిలో ఇద్దరు మహిళల మెడలో నుండి పుస్తెలతాడు లను దొంగిలించారు. డాబాలపై నిద్రిస్తున్న, ఆరుబయట నిద్రిస్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. చోరీ తర్వాత పుస్తెలను వదిలి… గొలుసును మాత్రమే దొంగలు తీసుకెళ్తున్నారు. లబోదిబో మంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. యాదాద్రిలో ఇలా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఇప్పటికైనా చర్యలు తీసుకుని దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు.
War2 : ఎన్టీఆర్ కోసం ఆ బ్యూటీని దింపారా.. ఇది కదా కిక్కు..