NTV Telugu Site icon

Robberies in Temples: రెచ్చిపోతున్న దొంగలు.. ఆలయాలు, ఏటీఎంలలో చోరీలు

Crime

Crime

దొంగలు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ కాటేదాన్ లో దొంగలు పేట్రేగిపోతున్నారు. మొన్న దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు. అది మరచిపోకముందే ఏటీఎం లో చోరీకి విఫలయత్నం చేశారు. అలారం మ్రోగడం తో పరారయ్యారు దుండగులు.కాటేదాన్ శ్రీ రామ్ నగర్ కాలనీకి సమీపంలో ఉన్న యాక్సెస్ బ్యాంక్ ఏటీఎం లోకి చొరబడ్డారు కొంతమంది దుండగులు.

తమతో తెచ్చుకున్న రాడ్ తో ఏటీఎం డోర్ ధ్వంసం చేశారు దుండగులు. డోర్ తెరచుకోవడంతో వెంటనే అలారం మోగింది. దీంతో వెంటనే అలర్ట్ అయి ఏటీఎం వద్దకు చేరుకున్నారు మైలార్ దేవ్ పల్లి పోలీసులు. పోలీసుల రాకను పసి గట్టి అక్కడి నుండి పారిపోయాడో దుండగుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఏటీఎం లో ఉన్న సీసీ టీవీ కెమేరాలు ధ్వంసం చేశారు ఇద్దరు దుండగులు. దొంగతనం దృశ్యాలు రికార్డ్ కాకుండా సీసీ కెమేరాకు గుడ్డ కట్టారు దుండగులు. దేవాలయాల్లో చోరీలకు వీరికి సంబంధం వుందేమోనని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరో ఘటనలో…

రాజేంద్రనగర్ లో దారుణం చోటుచేసుకుంది. డైరీ ఫామ్ వద్ద మామ అల్లుళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో మామ పై కత్తి తో దాడి చేశాడు అల్లుడు. మామ కుడి చేతికి కత్తి పోట్లు తగిలాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు బంధువులు. తప్ప తాగి రాత్రి సమయంలో తమ ఇంటి వద్ద మామ గొడవ చేస్తున్నాడని కత్తితో అల్లుడే దాడి చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.

JP Nadda : ఈ నెల 5న మహబూబ్‌నగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు

Show comments