Crime News : బైకు పాడైంది డబ్బులివ్వమంటే.. కత్తి తీసి కడుపులో పొడిచాడు

Murder

Murder

Crime News : నాగ్‌పూర్ లో షాకింగ్ సంఘటన జరిగింది. చూసుకోకుండా వచ్చి బైకును ఢీకొట్టడంతో నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఓ వ్యక్తిని నిందితులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 10 గంటలకు నాగ్‌పూర్‌లోని కల్మన పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ ప్రాంతంలో జరిగింది. హత్యకు గురైన యువకుడి పేరు లక్ష్మీనారాయణ అలియాస్ అజయ్ తట్టు చందానియా. గత ఎనిమిది రోజుల్లో నాగ్‌పూర్‌లో జరిగిన మూడో హత్య ఇది.

లక్ష్మీనారాయణ, అతని స్నేహితుడు విజయనగరం ప్రాంతంలో బైకు పై వెళ్తున్నారు. ఆ సమయంలో అతడి బైక్‌ను మరో వ్యక్తి వినయ్ బైక్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో బైకు దెబ్బతినడంతో లక్ష్మీనారాయణ, అతని స్నేహితుడు నిందితుల నుంచి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే వివాదం ముదిరి రెండో బైక్‌పై వచ్చిన నిందితులిద్దరూ లక్ష్మీనారాయణను కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ గొడవలో అతడి స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

Read Also: Himanshu : మాజీ ఎమ్మెల్యే మనువడు హిమాన్షుని కొట్టిచంపిన దుండగులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయ్ సాహు తన మేనల్లుడి పుట్టిన రోజు సందర్భంగా కేకు తీసుకురావడానికి బైకుపై బయలుదేరాడు. అదే సమయంలో గుల్‌మోహర్‌నగర్‌ సమీపంలో వినయ్, లక్ష్మీనారాయణ బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ బైక్‌ ధ్వంసమైంది. కాబట్టి పరిహారం ఇవ్వాలని వినయ్ ను కోరాడు లక్ష్మీనారాయణ. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ గొడవలో వినయ్ సాహు ముఖానికి గాయమై రక్తం కారింది. దీంతో ఆవేశానికి లోనైన వినయ్ తన వద్ద ఉన్న కత్తితో లక్ష్మణ్ ను పొడిచాడు. బైక్‌పై వెళ్తున్న స్నేహితుడిపై కూడా వినయ్‌ దాడి చేశాడు.

Read Also: Varun Gandhi: బీజేపీకి షాక్.. త్వరలో కాంగ్రెస్ లోకి వరుణ్ గాంధీ ?

ఈ ఘటనలో లక్ష్మీనారాయణకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కలమన పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష్మీనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అతడి స్నేహితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వెంటనే నిందితుడు వినయ్ సాహు చేతికి సంకెళ్లు వేశారు. ఈ ఘటనపై కల్మన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంలోనే వినయ్ లక్ష్మీనారాయణపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వినయ్ పై గతంలో ఎలాంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేదని చెప్పారు.