Road Accidents: అనంతపురంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. గుత్తి మండలం బాచుపల్లి సమీపంలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.. కారు – లారీ ఢీకొనడగా… ఘటనా స్థలంలోనే నలుగురు మృతి చెందారు.. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు.. మృతులంతా అనంతపురంలోని రాణి నగర్ వాసులుగా గుర్తించారు పోలీసులు.. క్షతగాత్రులను గుత్తి ఆసుపత్రికి తరలించారు.. హైదరాబాద్ – బెంగుళూరు జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: supreme court: మనీలాండరింగ్ యాక్ట్ లో అరెస్ట్ చేయాలంటే ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి
ఇక, కడప జిల్లా ముద్దనూరులో లోడుతో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది.. ముద్దనూరు లోని రైల్వ్ గేటు సైతం తుంచుకొని వెళ్లి చలపతి అనే అతని ఇంటిలోకి దూసుకెళ్లింది లారీ.. ఇంటిలోకి లారీ దూసుకెళ్లడంతో లారి ముందుభాగం తీవ్రంగా దెబ్బంది.. దీంతో.. లారీ డ్రైవర్ అక్కడికి అక్కడే మృతి చెందాడు.. గతంలో కూడా ఇదే ప్రాంతంలో.. ఇతే తరహాలో ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.. వేరే లారి ఇంటిని ఢీకొట్టగా అప్పుడు జరిగిన ప్రమాదంలో కూడా డ్రైవర్ మృతి చెందారు.. కేసునమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి జాతీయ రహదారిపై మరో రోడ్డు ప్రమాదం జరిగింది.. ముందు వెళ్తున్న వాహనాన్ని అతివేగంగా వెళ్లి ఢీకొట్టింది కారు.. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మల్లవరానికి చెందిన ప్రదీప్ మృతి చెందాడు.
