NTV Telugu Site icon

Road Accident: తమిళనాడులో దారుణం.. రోడ్డు ప్రమాదంలో 4 మృతి, 60 మందికి గాయాలు

Accident

Accident

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు బస్సులు ఢీ కొట్టుకోవడంతో నలుగురు మరణించారు. ఇక, ఈ ప్రమాదంలో 60 మందికి గాయాలు అయ్యాయి. తిరువత్తూర్ జిల్లా దగ్గర వానియంబడి హైవేపై ఈ ఘటన జరిగింది. రోడ్డు యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం తెలియడంతో వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించారు. అయితే, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని బస్సుల్లోని ప్రయాణికులు వెల్లడిస్తున్నారు. ఇక, పోలీసులు ఈ రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Show comments