NTV Telugu Site icon

Road Accident: బర్త్‌డే పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు యువకులు మృతి

Road Accident

Road Accident

Road Accident: బర్త్‌ డే పార్టీకి వెళ్లారు.. ఫుల్‌గా ఎంజాయ్‌ చేశారు.. కానీ, తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి.. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు నలుగురు యువకులు.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు యువకులు మృతి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించిగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

Read Also: Indian 2 : గ్రాండ్ గా ఆడియో లాంచ్ ప్లాన్.. అతిధులుగా రానున్న బడా స్టార్స్..?

కాగా, మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా.. ఎనిమిది మంది యువకులు యానం వెళ్లారు.. ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.. అర్ధరాత్రి వరకు యానాంలో ఫుల్లుగా మద్యం సేవించి.. ఆ తర్వాత ఆటోలో సొంత ఊరికి బయల్దేరారు.. అయితే, రాత్రి 12.30 గంటల సమయంలో అమలాపురం మండలం భట్నవిల్లిలో లారీని ఢీకొట్టింది ఆటో.. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు వదిలారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. వారికి చికిత్స నిమొత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఈ ప్రమాదంలో 1.సాపే నవీన్ (22) నగరం, 2. కొల్లాబత్తుల జతిన్ (26), 3. నల్లి నవీన్ కుమార్ (27) , 4. వల్లూరి అజయ్ (18) మృతిచెందినట్టుగా గుర్తించారు.. ఒక బర్త్‌డే వేడుక.. నాలుగు కుటుంబాల్లో విషాధాన్ని నింపినట్టు అయ్యింది.