Site icon NTV Telugu

RK Roja: ఈ సారి డిపాజిట్లు కష్టమే.. పవన్ కల్యాణ్‌పై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు..

Rk Roja

Rk Roja

RK Roja: పవన్ కల్యాణ్‌కి రైతు సమస్యలు మహిళల సమస్యలు, విద్యార్థుల సమస్యలు పట్టవని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.. హరిహర వీరమల్లు, OG సినిమా షూటింగ్ ల కోసం, బెనిఫిట్ షోలు రేట్లు ఎంత పెంచుకుందామని ఆలోచన తప్ప… ప్రజా సమస్యల పట్టవని విమర్శించారు.. ఆయన నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరిగితే స్పందించరన్నారు… పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లు చేసుకుంటే… రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్టు? అని ప్రశ్నించారు. ఈసారి పవన్ కల్యాణ్ కి డిపాజిట్లు కూడా రావంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎప్పుడు చూసినా హైదరాబాద్‌లో ఉండటం తప్ప.. పవన్ కల్యాణ్ చేసింది ఏంటి? అని ప్రశ్నించారు.

READ MORE: Rithu Chowdary : రీతూతో అర్ధరాత్రి డ్రగ్స్.. వీడియోలు లీక్.. అసలు నిజాలు బయటపెట్టిన హీరో

రెడ్ బుక్ అంటూ.. వైసీపీ నేతలు, కార్యకర్తల మీద ప్రతాపం చూపించిన నారా లోకేష్ కి, కూటమి నాయకులకు డిజిటల్ బుక్ అంటే ఏంటో చూపిస్తామని ఆర్కే రోజా అన్నారు.. తప్పు చేసిన ప్రతి అధికారిని, నాయకుడిని చట్టం ముందు నిలబెడతామని తెలిపారు… ఎన్నికల్లో హామీలు తుంగలో తొక్కి.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో సిగ్గులేకుండా సభ పెట్టుకున్నారని విమర్శించారు.. మహిళలకు ఇస్తానన్న 1500 రూపాయల పథకాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని ప్రశ్నించారు… ఈ ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

READ MORE: Vidya Balan : పద్దతిగా చీరకట్టి… వినయంగా ఫోజులిస్తున్న విద్యాబాలన్

Exit mobile version