NTV Telugu Site icon

Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌కి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీకి తరలింపు!

Lalu Prasad Yadav

Lalu Prasad Yadav

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. రక్తంలో చక్కెర పెరగడం వల్ల ఆయనకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు! పాట్నాలోని చికిత్స అందించారు. అనంతరం వైద్యులు ఆయనను ఢిల్లీకి వెళ్లమని సలహా ఇచ్చారు. లాలూ యాదవ్ గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఆయనకు తగిలిన పాత గాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఉదయం లాలు ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం.. రబ్రీ నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు.

READ MORE: Waqf Amendment Bill : వక్ఫ్ బిల్లుపై టీడీపీ స్టాండ్ ఇదే.. ఎంపీ కృష్ణ ప్రసాద్ ఏమన్నారంటే?

గతం(2022)లో పశువుల దాణ కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. అనారోగ్యం కారణంగా రాంచీలోని రిమ్స్​లో చేరారు. అక్కడే చాలా రోజులు చికిత్స పొందారు. అయితే.. ఇప్పుడే ఆయన ఆరోగ్యం క్షీణించింది. చీఫ్​ డాక్టర్ విద్యాపాటి.. ఢిల్లీలోని ఎయిమ్స్‌కి తరలించాలని సూచించారు. ఇప్పుడు ఆయన కోలుకున్నారు. అనంతరం 2024లో కూడా అనారోగ్యం పాలయ్యారు. అప్పటి నుంచి తరచూ అనారోగ్యానికి గురవుతునే ఉన్నారు.

READ MORE: Kunal Kamra: కునాల్ కమ్రా కేసులో ప్రేక్షకులకు పోలీసులు నోటీసులు.. ‘సారీ’ చెప్పిన కమెడియన్