Site icon NTV Telugu

Riyan Parag : ఇంపాక్ట్‌ ప్లేయర్‌ గా.. ఈ ఓవరాక్షన్ ఆటగాడు అవసరమా?

Riyan Parag

Riyan Parag

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. గత సీజన్ ( 2022 ) నుంచి పేలవమైన ప్రదర్శనతో చిరాకు తెప్పించే ఆట ఆడుతున్నాడు పరాగ్. గుజరాత్ ( మే 5 ) తో జరిగిన మ్యాచ్ లో 6 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిపోయాడు. ఈ సీజన్‌లో అతను ఆడిన ఆరు మ్యాచ్‌లు ఒక్క ఇన్సింగ్స్ లో కూడా కనీసం 20 పరుగులను చేయలేకపోయాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 7 (6), పంజాబ్‌పై 20 (12), ఢిల్లీపై 7 (11), గుజరాత్‌పై 5 (7), లక్నోపై 15 నాటౌట్‌ (12) పరుగులు చేశాడు.

Also Read : What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

దీంతో పరాగ్ మొత్తంగా ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌ల్లో కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు. పైగా గుజరాత్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ యాజమాన్యం ఇతగాడిని ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా పంపించింది. ఈ మ్యాచ్‌లో రియాన్‌ విఫలం కావడంతో రాజస్థాన్‌ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఓవరాక్షన్‌ ఆటగాడిని ఎందుకు ఆడించారు.. పైగా ఇతను ఇంపాక్ట్‌ ప్లేయర్‌ తీసుకొచ్చారంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. వీడికి ఆట తక్కువ ఓవరాక్షన్‌ ఎక్కువ అంటూ సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతున్నారు. ఏదో పొడుస్తాడని రాజస్థాన్‌ యాజమాన్యం ఇతన్నీ 3.8 కోట్లు పెట్టుబడి పెట్టిందని, వెంటనే ఇతన్ని జట్టు నుంచి తీసిపారేయలని డిమండ్‌ చేశారు.

Also Read : Jai Shankar: భారత్, చైనా మధ్య సంబంధాలపై జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

రియాన్‌ కంటే గల్లీలో ఆడుకునే చిన్న పిల్లలు నయమంటూ నెటిజన్స్ ఉతికి ఆరేస్తున్నారు. ఓ పక్క జట్టు మొత్తం విఫలమైన నెటిజన్లు రియాన్‌ పరాగ్ నే ఎక్కువగా టార్గెట్‌ చేశారు. కాగా, సొంత మైదానంలో (జైపూర్‌) గుజరాత్‌తో జరుగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. గుజరాత్‌ బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 3, నూర్‌ అహ్మద్‌ 2, షమీ, హార్ధిక్‌, జాషువ లిటిల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. రాజస్ణాన్‌ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్‌ (30) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Exit mobile version