NTV Telugu Site icon

Heavy Rains: ప్రమాదకర స్థాయిలో నర్మదా.. 12 వేల మంది తరలింపు

Gujarath Rains

Gujarath Rains

గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడోదర, భరూచ్, నర్మదా, దాహోద్, పంచమహల్, ఆనంద్, గాంధీనగర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న 11,900 మందిని షెల్టర్ హోమ్‌లకు తరలించారు. మరో 270 మంది ఒంటరిగా ఉన్న పౌరులను రక్షించారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నుంచి నీటి విడుదల కారణంగా గత రెండు రోజులుగా నీటిమట్టం 40 అడుగులకు పెరగడంతో భరూచ్ జిల్లాలోని నర్మదా నది ఒడ్డున నివసిస్తున్న 6 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం నుండి నీటి మట్టం నెమ్మదిగా తగ్గుతున్నప్పటికీ.. భరూచ్, తహసీల్‌, అంక్లేశ్వర్‌లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ మోకాళ్ల లోతు నీటిలోనే ఉన్నాయి.

World Cup 2023: టీమిండియా ప్రపంచకప్‌ గెలవడం ఖాయమన్న మాజీ కెప్టెన్

నర్మదా నది ప్రస్తుత నీటి మట్టం 37.72 అడుగులు ఉండగా.. అంకలేశ్వర్‌ను భరూచ్‌ను కలిపే గోల్డెన్ బ్రిడ్జ్ వద్ద 28 అడుగుల ప్రమాదకర స్థాయి కంటే దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉందని భరూచ్ జిల్లా అత్యవసర ప్రతిస్పందన కేంద్రం (BDERC) అధికారి తెలిపారు. మరోవైపు గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా.. ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. అంతేకాకుండా.. కూలిన చెట్లను తొలగించడం ద్వారా రోడ్లను క్లియర్ చేసే పనిలో ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Nipah Outbreak: రాష్ట్రానికి బిగ్‌ రిలీఫ్.. నిఫా వైరస్‌పై కేరళ ప్రభుత్వం

ఇదిలావుండగా.. వడోదర జిల్లాలోని కర్జన్ తాలూకా నుండి నర్మదా నదిలో ఒక చిన్న ద్వీపంలో చిక్కుకుపోయిన 12 మందిని ఆర్మీ సిబ్బంది 48 గంటల ఆపరేషన్ తర్వాత రక్షించినట్లు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఆర్మీ సిబ్బంది వారిని విజయవంతంగా రక్షించి.. మహిళలు, పిల్లలతో సహా 12 మందిని సోమవారం ఉదయం పడవల సహాయంతో ఒడ్డుకు చేర్చారని పేర్కొంది. మరోవైపు గడిసిన 24 గంటల్లో అర్వల్లి, మహిసాగర్, పంచమహల్, సబర్‌కాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళవారాల్లో గుజరాత్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ షేర్ చేసిన వర్షపాతం డేటా ప్రకారం.. సోమవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య 29 తహసీల్‌లలో 40 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఎనిమిది గంటల్లో జునాగఢ్ జిల్లాలోని విసావదర్ తాలూకాలో 283 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Show comments