NTV Telugu Site icon

Vegetable Prices: పెరుగుతున్న కూరగాయల ధరలు.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం

గత కొన్ని రోజులుగా దేశంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. టమోటా, ఉల్లి, బంగాళదుంప వంటి నిత్యావసర కూరగాయల రిటైల్ ధరలు.. 15 శాతం నుంచి 58 శాతానికి పెరిగాయి. అందుకు కారణం వర్షం ప్రభావంతో పాటు.. ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రానున్న రోజుల్లో ధరలు అదుపులోకి రానున్నాయని తెలిపింది. అయితే కూరగాయల ధరలు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి? దీని వెనుక ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసుకుందాం.

Central Government Jobs: ఉద్యోగాల జాతర.. ఏకంగా 71,321 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

ఇటీవల పార్లమెంట్‌లో సమర్పించిన ఆర్థిక సర్వేలో కూరగాయల ధరలు పెరగడానికి గల కారణాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రతికూల వాతావరణం, పంట నష్టాలు గత రెండేళ్లలో వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేశాయని ప్రభుత్వం నివేదించింది. ఈ కారణంగా.. ఆహార ధరలు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొంది. కేవలం కూరగాయల ధరలే కాకుండా.. పప్పుధాన్యాల ఉత్పత్తిని కూడా ప్రభావితం చేశాయని తెలిపింది. 2023-2024లో దేశంలో చాలా ప్రతికూల వాతావరణ సంఘటనలు జరుగుతాయని నివేదికలో చెప్పారు. దీంతో పంటలకు చాలా నష్టం వాటిల్లింది. అంతే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రిజర్వాయర్ స్థాయిలు క్షీణించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తి, ఆహార ధరలను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. అందువల్ల.. వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం FY22లో 3.8 శాతం నుండి FY23లో 6.6 శాతానికి.. FY24లో 7.5 శాతానికి పెరిగింది.

Fertility: IVF సెంటర్లకు పరుగుపెడుతున్న భారతీయులు.. పడిపోతున్న సంతానోత్పత్తి రేటు.. కారణాలేంటి..?

వాతావరణ మార్పుల కారణంగా ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక సర్వేలో తేలింది. అంతే కాకుండా.. ఆయా ప్రాంతాల వారీగా పంటలకు వచ్చే వ్యాధుల కారణంగా కూరగాయల సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో.. మార్కెట్లోకి దిగుబడి తగ్గి ధరలు పెరుగుతున్నాయి. ఈ కారణంగా టమాట ధరలు పెరిగాయి. గత రెండేళ్ళలో ప్రతికూల వాతావరణం.. తక్కువ ఉత్పత్తి కారణంగా ఉల్లి ధరలు, కందిపప్పు ధరలు పెరిగాయి. అయితే రబీ సీజన్‌లో నెమ్మదిగా విత్తడం, దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ అవాంతరాల కారణంగా పలు ఉత్పత్తులు దెబ్బతిన్నాయి.