Site icon NTV Telugu

UK: ఊహాగానాలకు తెర.. జూలై 4న యూకేలో ముందస్తు ఎన్నికలు

Raeui

Raeui

ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలకు బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ పిలుపునిచ్చారు. జూలై 4న ముందస్తు సాధారణ ఎన్నికలకు రిషి సిద్ధపడ్డారు. యూకే ప్రధాని రిషి అనూహ్యంగా బుధవారం ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల ప్రకటన తర్వాత శుక్రవారం బ్రిటన్ పార్లమెంట్‌ను రద్దు చేయబడుతుందని రిషి సునక్ కార్యాలయం తెలిపింది.

ఇది కూడా చదవండి: Prabhas :ప్రభాస్ స్టంట్ అంత పర్ఫెక్ట్ గా రావడానికి కారణం ఏంటో తెలుసా?

అనేక నెలలుగా ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వినబడుతున్నాయి. మొత్తానికి రిషి సునక్ ఊహాలకు తెరదించారు. పార్లమెంటును రద్దు చేయమని అభ్యర్థించడానికి ముందుగా హిజ్ మెజెస్టి ది కింగ్‌తో రిషి మాట్లాడాను. రిషి అభ్యర్థనను రాజు ఆమోదించారు. అనంతరం జూలై 4న సాధారణ ఎన్నికలు జరుగుతాయని రిషి సునక్ చెప్పారు.

ఇది కూడా చదవండి: Pune car crash: నిరసనలకు దిగొచ్చిన కోర్టు.. నిందితులకు బెయిల్ రద్దు

 

Exit mobile version