NTV Telugu Site icon

Rishi Sunak: అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ కీలక వ్యాఖ్యలు

Risi

Risi

అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించేందుకు క్యూ కడుతున్నారని.. వారంతా లేబర్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ వ్యాఖ్యానించారు. జులై 4న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రిషి సునాక్ ప్రసంగించారు.

ఇది కూడా చదవండి: Indian Weddings: చదువుల కన్నా “వివాహాల”పై ఎక్కువగా ఖర్చు చేస్తున్న భారతీయులు..

వేలాదిగా అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించేందుకు ఎదురుచూస్తున్నారని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ హెచ్చరించారు. అటువంటి వారంతా ఫ్రాన్స్‌లోని కలైస్‌లో వేచిచూస్తున్నారని పేర్కొన్నారు. బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ అధికారంలోకి రావాలని వారు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే దాదాపు 13 వేల మంది బ్రిటన్‌లోకి అక్రమంగా వచ్చారని అన్నారు.

ఇది కూడా చదవండి: T20 World Cup 2024: నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్.. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఛీటింగ్..

సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ లేబర్‌ పార్టీ నేత కైర్‌ స్టార్మర్‌పై ప్రధాని రిషి సునాక్‌ విమర్శలు గుప్పించారు. అక్రమ వలసదారులను ఆ పార్టీ అనుమతించేందుకు సిద్ధంగా ఉందన్నారు. వలసలను కట్టడి చేసే ప్రణాళిక స్టార్మర్‌ వద్ద లేదని.. వాళ్లు అధికారంలోకి వస్తే రువాండా విధానాన్ని వెనక్కి తీసుకుంటారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Darshan Fan Arrested: దర్శన్‌ అభిమాని అరెస్ట్‌.. ఎందుకంటే?