NTV Telugu Site icon

Rishabh Pant-DPL: ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో రిషబ్ పంత్!

Rishabh Pant

Rishabh Pant

ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ (డీపీఎల్‌) టోర్నీ శనివారం (ఆగష్టు 17) నుంచి ఆరంభం కానుంది. తొలి ఎడిషన్‌లో టీమిండియా స్టార్‌ క్రికెటర్ రిషబ్ పంత్ బరిలోకి దిగుతున్నాడని తెలుస్తోంది. డీపీఎల్‌లోని అన్ని మ్యాచ్‌లలో కాకపోయినా కొన్నింట్లో ఆడే అవకాశం ఉంది. వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న దులీప్‌ ట్రోఫీ 2024లోనూ పంత్ ఆడనున్న సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్‌లోకి పునరాగమనం ఘనంగా చేసేందుకు దులీప్‌ ట్రోఫీని అతడు వాడుకోనున్నాడు.

Also Read: Shakib Al Hasan: నా భర్త నన్ను మోసం చేయలేదు.. బంగ్లా మాజీ కెప్టెన్ షకీబ్ భార్య!

‘రిషబ్ పంత్ డీపీఎల్‌ టీ20 లీగ్‌ తొలి మ్యాచ్‌ ఆడేందుకు ఒప్పుకున్నాడు. ఢిల్లీ కుర్రాళ్లకు గొప్ప వేదికగా నిలబోయే ఇలాంటి టోర్నీకి ప్రచారం కల్పించేందుకు పంత్ ముందుకు రావడం అభినందనీయం. అతడి కెరీర్‌ ముందుకు సాగడంలో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌ ముఖ్య భూమిక పోషించింది’ అని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లి వచ్చిన పంత్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదం అనంతరం ఐపీఎల్ 2024లో పునరాగమనం చేసిన పంత్.. టీ20 ప్రపంచకప్ 2024లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన విషయం తెలిసిందే.