NTV Telugu Site icon

Rishabh Pant: థాంక్యూ గాడ్.. అంటూ రిషబ్ పంత్ ఎమోష‌నల్ పోస్ట్..

Rishab

Rishab

527 రోజుల విరామం తర్వాత భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత రిషబ్ పంత్ భావోద్వేగానికి గురయ్యాడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) విడుదల చేసిన వీడియోలో, ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులోని ఇతర సభ్యులతో నెట్ సెషన్ తర్వాత పంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భారత జెర్సీతో తిరిగి మైదానంలోకి రావడం పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుందని, నేను చాలా కోల్పోయాను అని పంత్ అన్నాడు. ఇక ప్రస్తుతం ఇక్కడ సహ ఆటగాళ్లను చూడటం, వారిని మళ్లీ కలవడం, సమయం గడపడం, వారితో సరదాగా గడపడం లాంటివి నేను నిజంగా నేను నిజంగా ఆనందించానని తెలిపాడు.

అలాగే X ఖాతా ద్వారా చేసిన పోస్ట్ లో దేవుడా.. నీకు ధన్యవాదములు. భారతీయ జెర్సీ ధరించడం నాలో కృతజ్ఞత, ఆనందం, గర్వాన్ని నింపుతుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పొందడం కంటే మెరుగైన అనుభూతి మరొకటి లేదని పంత్ రాశాడు. భారత వికెట్ కీపర్ సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి చిత్రాలకు పోజులిచ్చాడు. ఐపీఎల్ 2024ను పంత్ బ్యాట్‌ తో అద్భుతమైన ప్రదర్శన చేసాడు. అతను 13 మ్యాచ్‌లలో 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. మూడు అర్ధ సెంచరీలతో పాటు జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కెప్టెన్‌ గా కూడా ఉన్నాడు.

కాకపోతే జట్టు IPL 2024 పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో నిలిచింది. అతని అద్భుత ప్రదర్శన భారత జట్టుకు ఎంపికయ్యేలా చేసింది. మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు పంత్ మొదటి బ్యాచ్ భారతీయ ఆటగాళ్లతో కలిసి అమెరికాకు వెళ్లాడు.