NTV Telugu Site icon

Rishabh Pant: రిషభ్ పంత్ హెల్త్ అప్‌డేట్..ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

Pant

Pant

రోడ్డు యాక్సిడెంట్‌కు గురై ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్. గతేడాది డిసెంబర్‌ 30న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ముంబైలోని కోకిలాబెన్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. కాగా, పంత్‌కు సంబంధించిన హెల్త్‌ అప్‌డేట్‌ నేడు(జనవరి 31) విడుదలైంది. పంత్‌ మోకాలి సర్జరీ సక్సెస్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. అలాగే ఆస్పత్రి వర్గాలు మరో శుభవార్త కూడా చెప్పాయి. పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడని, ఈ వారంలోనే అతన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని వారు వెల్లడించారు. మార్చిలో పంత్‌కు మరో విడత మోకాలి సర్జరీ జరుగుతుందని, పంత్‌ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 8-9 నెలల సమయం పడుతుందని వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి కూడా ధృవీకరించారు.

Payyavula Keshav: విశాఖ రాజధాని.. సీఎం ప్రకటన వెనుక అనేక కారణాలు..

పంత్‌ ప్రస్తుతం కోలుకునే దశలోనే ఉండటంతో ఈ ఏడాది జరిగే కీలక సిరీస్‌లు, టోర్నీలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఆస్ట్రేలియా సిరీస్‌, ఆ తర్వాత జరిగే ఐపీఎల్‌, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, ఆసియా కప్‌, వన్డే వరల్డ్‌కప్‌లను పంత్ దూరం కానున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పంత్‌కు ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో ఉండగా.. ఆసీస్‌ టెస్ట్‌ సిరీస్‌లో మాత్రం పంత్‌ లేని లోటు టీమిండియాపై పెను ప్రభావం చూపనుంది.

INDvsAUS Test: ఇండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్‌కు షాక్.. స్టార్ పేసర్‌కు గాయం

కాగా, ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2022లో రిషభ్ పంత్‌కు చోటు దక్కింది. గతేడాది టెస్టుల్లో అద్భుత పెర్ఫామెన్స్ చేసిన టీమిండియా వికెట్ కీపర్ పంత్‌కు మాత్రమే టెస్టు టీమ్‌లో చోటిచ్చారు. ఈ టీమ్‌లో చోటు దక్కించుకున్న పంత్‌.. నిరుడు 12 ఇన్నింగ్స్‌ల్లో 90.09 యావరేజ్‌తో 680 రన్స్ చేసి సత్తాచాటాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే కీపర్‌గా 23 క్యాచ్‌లు అందుకున్నాడు.