Site icon NTV Telugu

Rishabh Pant: రిషబ్ పంత్‌ కీలక నిర్ణయం.. ఆ కక్కుర్తి ఏంటి అంటూ ఫాన్స్ ఆగ్రహం!

Rishabh Pant

Rishabh Pant

Fans Slams Rishabh Pant over Instagram Subscription: ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్‌ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లోనే చికిత్స తీసుకున్న పంత్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. గాయం కారణంగా త్వరలో జరిగే ఆసియా కప్ 2025కి దూరం కానున్నాడు. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటున్న పంత్ ఎంజాయ్ చేస్తున్నాడు. చెఫ్ అవతారం ఎత్తి పిజ్జా తయారు చేశాడు. అయితే అతడు తీసుకున్న ఒక నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఫాన్స్ పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రిషబ్‌ పంత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ నిత్యం అభిమానులకు టచ్‌లోనే ఉంటాడు. అప్పుడపుడు లైవ్స్ కూడా నిర్వహిస్తుంటారు. అయితే పంత్‌ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను పోస్టు చేసే ఎక్స్‌క్లూజివ్‌ వీడియోలు చూసేందుకు లేదా ప్రశ్నలు అడిగేందుకు సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను తీసుకొచ్చాడు. ఇందుకోసం నెలకు రూ.390 చెల్లించాల్సి ఉంటుంది. దాంతో అభిమానుల నుంచే పంత్‌పై వ్యతిరేకత వస్తోంది. ‘కోట్లకు కోట్లు సంపాదిస్తున్నావ్ కదా.. ఈ కక్కుర్తి ఏంటి’ అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక పంత్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయాల్సిందే అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

Also Read: Begum Bazar: బేగంబజార్‌లో కుప్పకూలిన బిల్డింగ్.. బల్దియా అధికారులపై జనం ఫైర్!

రిషబ్‌ పంత్ ప్రస్తుతం చాలా విధాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. క్రికెట్ కెరీర్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారం, పెట్టుబడులతో బాగానే డబ్బు సంపాదిస్తున్నాడు. ఓ నివేదిక ప్రకారం 2025 నాటికి పంత్ నికర విలువ దాదాపు రూ.100 కోట్లు (12.2 మిలియన్ డాలర్లు). ఐపీఎల్ 2025 వేలంలో లక్నో ప్రాంచైజీ పంత్‌ను రూ.27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అంత డబ్బు ఉంది కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వేల కోసం ఈ కక్కుర్తి ఏంటి అంటూ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version