Site icon NTV Telugu

Rishabh Pant: టెస్ట్ సిరీస్‌కు పంత్‌ దూరం.. 10 మందితోనే ఆడనున్న టీమిండియా!

Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant Ruled Out of England vs India Test Series: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. మాంచెస్టర్ టెస్టులో గాయపడ్డ పంత్‌కు ఆరు వారాలు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దాంతో నాలుగో టెస్ట్ సహా.. ఐదవ టెస్టుకు సైతం అతడు దూరమయ్యాడు. పంత్‌ స్థానంలో మరో వికెట్ కీపర్ ధ్రువ్‌ జురెల్ ఆడనున్నాడు. పంత్ పాదం చివరి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది.

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో రిషభ్ పంత్ గాయపడ్డాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో అతడికి గాయం అయింది. బంతి బ్యాట్ ఎడ్జ్ తగిలి.. ఆపై పంత్ కుడి కాలి పాదానికి బలంగా తాకింది. వెంటనే అతడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. చికిత్స చేసినా లాభం లేకపోవడంతో.. పత్యేక వాహనంలో పంత్ మైదానం నుంచి బయటకు వెళ్లాడు. పంత్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాక రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. స్కాన్ రిపోర్ట్‌లలో పంత్ పాదం చివరి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ఆరు వారాలు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు.

రూల్స్ ప్రకారం.. కంకషన్ సబ్‌స్టిట్యూట్ అయితేనే గాయపడిన ఆటగాడి స్థానంలో మరో ప్లేయర్ వస్తాడు. ఇక్కడ రిషభ్ పంత్‌కు తలకు కాకుండా.. కాలికి గాయం అయింది కాబట్టి మరో ఆటగాడు భారత్ తరఫున బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. కేవలం కీపింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్ 10 మందితోనే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ. ఎందుకంటే ఈ సిరీస్‌లో అతడు అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సిరీస్‌లో సెకెండ్ లీడింగ్ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేసే అవకాశం మాత్రమే ఉంది. మొదటి రోజు పంత్ 48 బంతుల్లో 37 పరుగులు చేశాడు.

Exit mobile version