Kantara Part 3:రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరాహ రూపం.. దైవ రిషితం! ఆ గంభీరమైన గొంతు, ఉప్పొంగే ఆవేశం, అడవి తల్లి సాక్షిగా సాగిన ఆ పోరాటం యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించాయి. కేవలం 15 కోట్లతో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే, ఇప్పుడు ఈ సినిమా మూడో భాగం కోసం వేచి చూస్తున్న అభిమానులకు ఒక చేదు వార్త వినిపిస్తోంది. రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రిషబ్ శెట్టికి, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కు మధ్య తలెత్తిన విభేదాలే అని ఇండస్ట్రీ టాక్.
Also Read : Peddi: మళ్ళీ ఊరిస్తున్న ‘పెద్ది’..
Also Read
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రిషబ్ తన తదుపరి ప్రాజెక్టుల్లో తన భార్య ప్రగతి శెట్టిని సహ నిర్మాతగా చేర్చాలని పట్టుబడుతున్నారట. తన సక్సెస్ జర్నీలో భాగమైన తన ఫ్యామిలీని బిజినెస్‌లోకి తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే హోంబలే ఫిల్మ్స్ లాంటి ఒక పెద్ద కార్పొరేట్ బ్యానర్, రిషబ్ పెట్టిన ఈ కండిషన్‌కు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. గతంలోనే వీరి మధ్య కొన్ని ఆర్థిక పరమైన విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ గడువు ముగియడంతో, దాన్ని పునరుద్ధరించే క్రమంలో ఈ నిబంధనలు అడ్డంకిగా మారాయని, అందుకే ‘కాంతార’ తదుపరి భాగం ప్రస్తుతం హోల్డ్‌లో పడిందని సమాచారం.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రిషబ్ శెట్టి దైవాన్ని బలంగా నమ్ముతారు. ఇటీవలే ఆయన ‘కాంతార హరకె నేమోత్సవం’లో పాల్గొన్నప్పుడు, తదుపరి భాగం తీయాలా వద్దా అని దైవాన్ని ప్రార్థించగా సానుకూల సంకేతం లభించిందని ప్రచారం జరిగింది. దైవం నుంచి ఆదేశం వచ్చినా, ఈ నిర్మాణ వివాదాల వల్ల సినిమా పట్టాలెక్కకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇదే సమయంలో రిషబ్ ఇతర భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ ఛత్రపతి శివాజీ బయోపిక్ వంటి చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది కాబట్టి, ఒకవేళ వివాదాలు సర్దుమణిగినా ‘కాంతార-3’ రావడానికి చాలా కాలమే పట్టేలా ఉంది.
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!