NTV Telugu Site icon

Rishab Shetty : కాంతారా 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి..?

Whatsapp Image 2023 07 09 At 8.22.52 Am

Whatsapp Image 2023 07 09 At 8.22.52 Am

రిషబ్ శెట్టి ఈ పేరు గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు. దర్శకుడిగా కన్నడ ఇండస్ట్రీలో ఆయన ఎంతగానో పాపులర్ అయ్యారు. ఇక గత ఏడాది ఆయన తెరకెక్కించిన కాంతారా సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాంతారా సినిమాను డైరెక్ట్ చేయడమే కాకుండా సినిమా లో ఎంతో అద్భుతంగా నటించారు రిషబ్.కాంతారా సినిమాతో రిషబ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. తాజాగా రిషబ్ శెట్టి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తన పుట్టినరోజున కాంతారా 2 అప్‌డేట్‌ ను ప్రకటిస్తారని అభిమానులు ఎంతో ఎదురు చూసారు.అయితే తన పుట్టినరోజు ముగింపు వేడుకల్లో రిషబ్ శెట్టి కాంతారా 2 చిత్రం గురించి మాట్లాడటం జరిగింది..‘కాంతారా 2 సినిమా పనులు ఎంతవరకు వచ్చాయో ఆయన చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు కొనసాగుతున్నాయని ఇక నుంచి లొకేషన్‌ సెర్చ్‌ అలాగే ఆర్టిస్ట్‌ ఎంపిక కూడా జరుగుతుందని ఆయన తెలిపారు.. ఆ తర్వాత షూటింగ్ అప్డేట్ హోంబాలే ఫిలింస్ అధికారికం గా ప్రకటిస్తుందని ఆయన తెలిపారు..

కాంతారా 2 చిత్రాన్ని ఈ సంవత్సరమే చిత్రీకరించి 2024లో విడుదల చేస్తాం’ అని రిషబ్‌ తెలిపారు. అదే సమయంలో కాంతార సీక్వెల్‌ పై వస్తోన్న పుకార్లను అస్సలు నమ్మవద్దని ఆయన సూచించారు.తన పుట్టిన రోజు వేడుకల గురించి మాట్లాడుతూ.. ‘నేను నాకు పుట్టినరోజు వేడుకను చేసుకోవాలని ఆలోచన లేదు. బెంగళూరు వచ్చినప్పటి నుంచి పుట్టినరోజులు జరుపుకుంటున్నాను. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు నా పుట్టినరోజున కూడా పని చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే ఈసారి అభిమానులను కలవాలి అని అనుకున్నాను ’ అని రిషబ్‌ చెప్పుకొచ్చారు.కాంతారా సినిమా తరువాత ఎంతో మందిని కలవడం కుదరలేదు. నా సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి కారణం ప్రేక్షకులు. వారి ఋణం ఎప్పటికి తీర్చుకోలేను నా పుట్టినరోజు సందర్బం గా వారికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని రిషబ్ తెలిపారు.