NTV Telugu Site icon

Rishab Shetty : తనకు వచ్చిన జాతీయ అవార్డును వారికి అంకితం ఇచ్చేసిన రిషబ్ శెట్టి.!

New Project (35)

New Project (35)

Rishab Shetty : జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరి ఇందులో ఉత్తమ నటుడిగా ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ కి గాను కాంతారా చిత్రానికి అవార్డును అందుకున్నారు. దీంతో ఆ అవార్డుకు తను తగినవాడే అంటూ అందరూ ప్రశంసలు కురిపించారు. మరి లేటెస్ట్ గా ఈ అవార్డు గెలిచిన తర్వాత రిషబ్ ఒక ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. తను జాతీయ అవార్డు గెలుచుకోవడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను అని అలాగే తనతో ఈ ప్రయాణంలో భాగం అయిన అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ తెలిపారు. అలాగే తనకి వచ్చిన ఈ అవార్డును తన రాష్ట్రంలో దేవ నర్తకులకి అలాగే దివంగత హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారికి అంకితం చేస్తున్నాను అంటూ తెలిపారు. ఇప్పుడు తన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also:Anti-Cancer Drugs: భారత్‌ మానవతా సాయం.. సిరియాకు 1,400 కిలోల క్యాన్సర్‌ మందులు

2022 సెప్టెంబర్ 30న కర్ణాటక రాష్ట్రంలో 250 థియేటర్లలో విడుదలై కాంతారా మూవీ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ఆ తర్వాత ఇతర భాషల్లో కాంతారా మూవీ డబ్ అయ్యి ఇతర భాషల్లో సైతం హిట్ గా నిలిచింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది అంటే ఈ సినిమా ప్రేక్షకులకు ఏ స్థాయిలో నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులకు బాగా నచ్చింది. కేంద్రం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించగా ఉత్తమ నటుడి పురస్కారం కాంతారా సినిమాకు గాను రిషబ్ శెట్టికి దక్కింది. రిషబ్ శెట్టికి జాతీయ అవార్డు దక్కడం సినీ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.

Read Also:Harish Rao Flexi: సిద్దిపేటలో అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం..

Show comments