Site icon NTV Telugu

Rinku Singh: యోగి సర్కార్ క్రికెటర్ రింకు సింగ్ కు బిగ్ గిఫ్ట్.. ఆ విభాగంలో ప్రభుత్వాధికారిగా..

Rinku

Rinku

టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ కు యోగి సర్కార్ బిగ్ గిఫ్ట్ ఇచ్చింది. రింకూ జిల్లా ప్రాథమిక విద్యాధికారి కానున్నారు. అంతర్జాతీయ క్రికెటర్ రింకు సింగ్ ఇప్పుడు విద్యా రంగంలో తన కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. అంతర్జాతీయ పతక విజేత డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ రూల్స్-2022 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆయనను జిల్లా ప్రాథమిక విద్యా అధికారి (BSA) పదవికి నియమించే ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించి ప్రాథమిక విద్య డైరెక్టర్ (బేసిక్) ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కీర్తిని తెచ్చే ఆటగాళ్లకు ప్రభుత్వ సేవలలో గౌరవప్రదమైన స్థానం కల్పించే రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం రింకు సింగ్‌ను ఈ పోస్టుకు ఎంపిక చేశారు.

Also Read:Off The Record: ఆ టీడీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు వేటు వేయనున్నారా..?

రింకు సింగ్ జీవితం పోరాటం, విజయానికి ఒక ఉదాహరణ. అతను 1997 అక్టోబర్ 12న అలీఘర్‌లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఖాన్‌చంద్ర గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ పంపిణీదారుగా పనిచేశాడు. రింకు కూడా మొదట్లో తన తండ్రికి ఈ పనిలో సహాయం చేశాడు. కానీ క్రికెట్ పట్ల అతనికి ఉన్న మక్కువ మైదానంలోకి లాగింది. తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. DPS పాఠశాల మైదానంలో అంతర్జాతీయ పాఠశాల క్రికెట్‌లో టైటిల్ గెలుచుకోవడం ద్వారా అతను ప్రారంభ గుర్తింపు పొందాడు.

Also Read:Tejeshwar Murder: గద్వాల మర్డర్ కేసు.. చదివింది పది వరకే.. కన్నింగ్ ప్లాన్స్‌లో మాత్రం పీహెచ్‌డీ

దీని తరువాత, అతను IPL లోకి అడుగుపెట్టి 2023 సంవత్సరంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరపున ఆడుతూ అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత రింకు భారత్ తరపున T20, ODI మ్యాచ్‌లు ఆడాడు. IPL 2025 మెగా వేలంలో, KKR అతనిని రూ. 13 కోట్లకు తమ జట్టులో చేర్చుకుంది. ఇటీవల రింకు సింగ్ SP MP ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. వారణాసిలో నవంబర్ 18న ఇద్దరి వివాహం జరగాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల అది ప్రస్తుతానికి వాయిదా పడింది.

Exit mobile version