NTV Telugu Site icon

Rinku Singh: 5 సిక్సర్ల మార్క్‌తో టాటూ.. కారణం ఇదే..!

Rinku

Rinku

భారత్-బంగ్లాదేశ్ మధ్య 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ రేపు (అక్టోబర్ 6 న) ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ గ్వాలియర్‌లో జరగనుంది. ఈ సిరీస్‌కి టీమిండియాలో హిట్టర్ రింకూ సింగ్ చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో తన దూకుడు ప్రదర్శనతో తనదైన ముద్ర వేయాలనుకుంటున్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో విఫలమైనప్పటికీ.. ఈ సిరీస్‌లో చెలరేగనున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో విధ్వంసం సృష్టించేందుకు రింకూ రెడీ అయ్యాడు. ఐపీఎల్ 2023లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అతను చివరి ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టాడు. యశ్ దయాళ్ ఓవర్‌లో బీభత్సం సృష్టించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్ రింకూ కెరీర్‌నే మార్చేసింది. ఐదు నెలల్లో భారత్‌కు ఆడే అవకాశం వచ్చింది.

Read Also: Haryana Polls: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. పోటెత్తిన హర్యానా ఓటర్లు

రింకు 2023 ఆగస్టు 18న జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో ఐర్లాండ్‌పై భారత్‌ తరుఫున అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి భారత టీ20 జట్టులో కొనసాగుతున్నాడు. రింకూ ఇప్పటి వరకు 23 టీ20 మ్యాచుల్లో 418 పరుగులు చేశాడు. కాగా.. రింకు శనివారం అధికారిక BCCI X హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో ‘గాడ్స్ ప్లాన్’ టాటూ గురించి వెల్లడించాడు.

Read Also: Rajendra Prasad : ‘నా కూతురుతో మాట్లాడను’.. వైరల్ అవుతున్న రాజేంద్ర ప్రసాద్‌ పాత వీడియో..!

ఆ వీడియోలో రింకూ మాట్లాడుతూ.. ‘‘నా ఫేమస్ పేరు టాటూ వేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది వేయించుకుని కొన్ని వారాలు అయ్యింది. ఈ టాటూ దేవుడి ప్లాన్. నేను 5 సిక్సర్లు కొట్టిన ప్రదేశాలు ఈ టాటూపై ఉన్నాయి. ఆ సిక్సులే నా జీవితాన్ని మార్చాయి. ప్రజలు ఇప్పుడు నన్ను గుర్తు పడుతున్నారు. అది శాశ్వ‌తంగా ఉండాల‌నే ఇలా చేతిపై ప‌చ్చ‌బొట్టు రూపంలో వేయించుకున్నాను.’అని రింకు సింగ్ తెలిపాడు.

Show comments