Site icon NTV Telugu

Rinku Singh: రాత్రికి రాత్రే సెలబ్రిటీని అయ్యా.. కెరీర్‌, లవ్, ఫాన్స్ అన్నీ సెట్!

Rinku Singh

Rinku Singh

టీమిండియా బ్యాటర్ ‘రింకు సింగ్‌’ పేరు చెప్పగానే.. అందరికీ టక్కున గుర్తొచ్చేది ఐపీఎల్ 2023. ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఆడుతూ గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోని చివరి ఓవర్‌లో పెను విధ్వంసమే సృష్టించాడు. యశ్‌ దయాల్‌ వేసిన 20వ ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది.. కోల్‌కతాకు ఊహించని విజయాన్ని అందించాడు. 5 బంతుల్లో 28 పరుగులు అవసరం అయినా సమయంలో రింకు సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ ఇన్నింగ్స్‌ను సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మర్చిపోడు. ఆ ఇన్నింగ్స్‌ తనకు అన్నీ ఇచ్చిందని రింకు చెప్పుకొచ్చాడు.

ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో రింకు సింగ్‌ మాట్లాడుతూ… ‘నా జీవితంలోనే ఆ రోజు ఎంతో ప్రత్యేకం. నేను కొట్టిన ఆ ఐదు సిక్సర్ల వల్లే నా గురించి అందరికీ తెలిసింది. ఆ ఇన్నింగ్స్‌ నా కెరీర్‌తో పాటు, నా వివాహానికీ హెల్ప్ అయింది. ఆరోజు ప్రియ సరోజ్‌ ఫోన్‌లో మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురై ఏడ్చేసింది. నిజానికి ఆ సమయంలో ప్రియ నాన్నకు నేను ఎవరో కూడా తెలియదు. ఆయనకు క్రికెట్‌ అంటే ఆసక్తి లేదు. అనంతరం నేను తెలిసిపోయా. ఐదు సిక్స్‌లతో నేను రాత్రికి రాత్రే సెలబ్రిటీని అయ్యా. ఆ క్షణం నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. నేను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. నా అభిమానులు, ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య అప్పుడే పెరిగింది. ఒక్క రాత్రిలో అంతా మారిపోయింది’ అని చెప్పాడు.

Also Read: IND vs UAE: టాస్ గెలిచిన భారత్.. అంచనాలకు భిన్నంగా తుది జట్టు!

రింకు సింగ్‌ కొంతకాలంగా పెద్దగా ఫామ్‌లో లేడు. ఐపీఎల్‌ 2025లో కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అయినా కూడా ఆసియా కప్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల స్వ్కాడ్‌లో స్థానం సంపాదించుకున్నాడు. టీ20 స్పెషలిస్ట్ కాబట్టి అతడికి సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే యూఏఈ మ్యాచ్‌లో అతడికి చోటుదక్కలేదు. మిడిలార్డర్‌లో సంజు శాంసన్, శివమ్ దూబేకు చోటు దక్కింది.

Exit mobile version