ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జో రిచర్డ్ సన్ గాయం కారణంగా టోర్నీకి దూరమైయ్యాడు. గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న రిచర్డ్ సన్.. పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇక ఈ ఏడాది సీజన్ కు దూరమైన రిచర్డ్ స్థానంలో మరో ఆసీస్ పేసర్ రిలే మెరెడిత్ ను ముంబై ఇండియన్స్ భర్తీ చేసింది. కనీస ధర రూ. 1.5 కోట్ల మెరెడిత్ తో ముంబై టీమ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా తరపున కేవలం 5 టీ20 మ్యాచ్ లు ఆడిన మెరెడిత్.. 8 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మూడు వికెట్లు హాల్ కూడా ఉంది. ఇక అతగికి ఐపీఎల్ లో ఆడిన అనుభవం కూడా ఉంది. మెరిడిత్ 2021లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేశాడు.
Also Read : Ab De Villers: కొన్ని సంవత్సరాలలో భారత కెప్టెన్‌గా సంజు శాంసన్: ఏబీ డివిలియర్స్
గత రెండు సీజన్ ల పాటు ముంబైకే ప్రాతినిథ్యం వహించిన అతగిని.. ఐపీఎల్ 2023 సీజన్ కు ముందు ఆ ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇక ఐపీఎల్ లో 13 మ్యాచ్ ల్లో మెరెడిత్ 12 వికెట్లు పడగొట్టాడు. ఇక ముంబూ ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 8న చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.
Also Read : Ab De Villers: కొన్ని సంవత్సరాలలో భారత కెప్టెన్‌గా సంజు శాంసన్: ఏబీ డివిలియర్స్
అయితే మెరెడిత్ 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోగలడు, IPL 2022లో ముంబై తరపున ఎనిమిది ఆటలు ఆడాడు, IPL 2021లో పంజాబ్ తరపున నాలుగు స్కాల్ప్‌లు తీసుకున్న తర్వాత జట్టుతో తన తొలి సీజన్‌లో ఎనిమిది వికెట్లు తీశాడు. మెరెడిత్ ఇప్పుడు వాంఖడే స్టేడియంలో శనివారం నాడు నాలుగు సార్లు IPL విజేత చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై యొక్క మ్యాచ్‌కు ముందు జట్టులో చేరనున్నాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్‌లో ముంబై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. టోర్నమెంట్‌లో ముంబై తన ఓపెనింగ్ గేమ్‌లో వరుసగా 11వ సారి ఓటమిని నమోదు చేసింది.