Site icon NTV Telugu

Ricky Kej: బ్రిటీష్ ఆర్కెస్ట్రాతో జ‌న గ‌ణ మ‌ణ… వింటే గూస్ బంప్సే

Ricky

Ricky

Janaganamana: బ్రిటీష్ ఆర్కెస్ట్రాలో జనగణమణ అదిరిపోయింది. వంద మంది బ్రిటీష్ ఆర్కెస్ట్రాతో రూపొందించిన ఈ వీడియో చూస్తేంటే గూస్ బంప్స్ రావడం పక్కా. గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్ దీనిని రికార్డ్ చేశారు. కొత్త తరహా ఇన్‌స్టుమెంట్స్‌తో జాతీయగీతాన్ని రికార్డు చేశారు. లండన్ లోని అబ్బే స్టూడియోస్ లో దీనిని రూపొందించారు.

ఇంత పెద్ద ఆర్కెస్ట్రాతో భార‌త జాతీయ గీతాన్ని రికార్డు చేయ‌డం ఇదే తొలిసారి. ఈ వీడియోను రిక్కీ కేజ్ తన ఎక్స్ (ట్విటర్ ) ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియో చివరిలో జయహే అన్నప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయని రిక్కీ కేజ్ తెలిపారు. ఇండియన్ కంపోజర్ గా ఈ వీడియో చేసినందుకు గర్వంగా ఉందన్నారు. వీడియోను ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ వీడియోను పంచుకుంటున్నట్లు రిక్కీ కేజ్ తెలిపారు.

Also Read: Pakistan Zindabad : పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు.. చితక్కొట్టిన జనం

ప్రతి ఒక్కరు దీనిని గౌరవంగా చూడండి, ఉపయోగించండి, షేర్ చేయండి అని రిక్కీ కోరారు. ఈ వీడియో రూపొందించిన రిక్కీ కేజ్ పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇది ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందని మోదీ కొనియాడారు.

 

Exit mobile version