Rice Price Hike: గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని ప్రభావం ఆసియా మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ బియ్యం ధర దాదాపు 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. భారతదేశం నుండి బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం, థాయ్‌లాండ్‌లో కరువు కారణంగా దిగుబడి పడిపోయింది. దీంతో బియ్యం ధరలపై ప్రభావం చూపడం ప్రారంభించింది. థాయ్ రైస్ ఎగుమతిదారుల సంఘం 5 శాతం విరిగిన థాయ్ బియ్యం ధర అక్టోబరు 2008 నుండి టన్నుకు 648డాలర్ల వద్ద అత్యధిక స్థాయికి చేరుకుందని డేటాను విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే బియ్యం ధరలో 50 శాతం పెరుగుదల నమోదైంది.
Read Also:Prakash Raj: ప్రకాశ్ రాజ్ సందర్శించిన కాలేజీని గోమూత్రంతో శుద్ధి చేసిన స్టూడెంట్స్
ఆసియా, ఆఫ్రికాలోని ప్రధాన తృణధాన్యాలలో బియ్యం ఒకటి. ఇది రెండు ఖండాలలోని కొన్ని వందల కోట్ల మందికి ఆకలిని తీర్చుతుంది. అటువంటి పరిస్థితిలో పెరుగుతున్న బియ్యం ధరలు నేరుగా అనేక దేశాలను ప్రభావితం చేస్తాయి. ఇది వారి దిగుమతి ఖర్చులను విపరీతంగా పెంచుతాయని భావిస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో థాయ్‌లాండ్‌లో వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బ్లూమ్‌బెర్గ్ ఓ నివేదికలో పేర్కొంది. దీంతో థాయ్‌లాండ్ ప్రభుత్వం తక్కువ నీరు అవసరమయ్యే పంటలను వేయాలని రైతులకు సలహా ఇచ్చింది. దీంతో బియ్యం దిగుబడిపై ప్రభావం పడింది. విశేషమేమిటంటే.. ఈ సంవత్సరం ఎల్ నినో కారణంగా థాయ్‌లాండ్‌లో 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీని ప్రభావం వరి పంటలపై కనిపిస్తోంది. అందుకే ఈ ఏడాది ఉత్పత్తి తగ్గుతుందని అంచనా.
Read Also:Work From Home: వర్క్ ఫ్రం హోం ఇచ్చి ఉద్యోగిపై నిఘా.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..
దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై భారత్ ఇటీవల నిషేధం విధించింది. దీంతో ప్రపంచ స్థాయిలో బియ్యం ధర పెరిగింది. భారతదేశం బియ్యం ఎగుమతిపై నిషేధం ప్రపంచ సరఫరా గొలుసును తీవ్రంగా ప్రభావితం చేసింది. థాయ్‌లాండ్ వంటి దేశాలలో తక్కువ ఉత్పత్తి పరిస్థితిని మరింత దిగజార్చింది. దీంతో ప్రపంచ సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడింది. ప్రపంచ బియ్యం ఎగుమతిలో భారత్ వాటా 40 శాతం కావడం గమనార్హం. బాస్మతీయేతర బియ్యాన్ని నిషేధిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రపంచ స్థాయిలో దాని ధరలో పెద్ద అస్థిరత ఏర్పడింది.