Site icon NTV Telugu

RI Suspend : అక్రమాలకు పాల్పడుతున్న ఆర్‌ఐ సస్పెండ్‌

Suspended

Suspended

కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా కాసులకు కక్కుర్తిపడి పట్టపగలే బహిరంగ కబ్జాలకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరమేశ్వర్ రెడ్డి సహకరించాడు.. 10 నెలల వ్యవధిలో 2500 వందల అక్రమ నిర్మాణాలతో పాటు, పలు చెరువులు, కుంటలు, గొలుసుకట్టు కాలువలు కబ్జాలపై చర్యలు తీసుకోవడంలో ఆర్ఐ పరమేశ్వర్ రెడ్డి పూర్తిగా విఫలం అయినట్లు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తేల్చారు.. దీంతో గాజులరామారం ఆర్ఐ.. పరమేశ్వర్ రెడ్డి ని సస్పెండ్ చేసారు..

Also Read : Gujarat: దారుణం.. గర్ల్‌ఫ్రెండ్‌పైనే అత్యాచారం.. పైశాచిక ప్రవర్తన

ఈనెల ఒకటవ తేదీన, చికోటి బెట్టింగ్ వ్యవహారంలో థాయిలాండ్ పోలీసుల దాడుల్లో అరెస్టు అయిన గాజులరామారం విఆర్ఏ వాసు సస్పెన్షన్ మరువక ముందే, ఆర్ఐ పరమేశ్వర్ రెడ్డి సస్పెన్షన్ కావడం జిల్లాలోనే సంచలనం రేపుతోంది.. ఆర్ఐ పరమేశ్వర్ రెడ్డి కుత్బుల్లాపూర్ ఆర్ఐగా విధుల్లో చేరిన నాటి నుండి 2500 అక్రమ గదులు అక్రమార్కులు నిర్మించి సుమారు సంవత్సర కాలంలో రూ.75 కోట్ల కుంభ కోణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. కబ్జా దారులపై చర్యలకు దూరంగా ఉంటూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడంతోనే RI పై వేటువేసారు.. గాజులరామారం కబ్జాలో ఆర్ఐ పరమేశ్వర్ రెడ్డి వసూళ్ళ వ్యవహారంలో ఇతర అధికారులు మరియు ప్రజాప్రతినిధుల వాటాలపై కూడా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి మండల రెవెన్యూ కార్యాలయంలో మరో ఇద్దరు VRAల సస్పెండ్ చేసారు.. నెలలోనే కుత్బుల్లాపూర్‌ కార్యాలయంలో మొత్తం 4గురు సిబ్బంది సస్పెండ్ కావడం గమనార్హం..

ఇద్దరు సస్పెండ్ అయినా భయపడని మరో ఇద్దరు నాగరాజు, దేవకుమార్ విఆర్ఏ లు దేవేందర్ నగర్ లో కూల్చివేతలు ఆపడానికి ఇద్దరు VRAలు Phone Pay ద్వారా ₹50,000/- లంచం తీసుకున్నారు.. నిన్న పెద్ద ఎత్తున కూల్చివేతలు జరిగి నివాసితులు యంఆర్ఓ ఆఫీస్ ముందు దర్నా నిర్వహించి పోలీసులపై చేయి చేసుకున్నారు..దీంతో ఈ విషయం పై విచారణ జరిపిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ ఇద్దరు VRA లను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసారు..

Exit mobile version